Begin typing your search above and press return to search.

నందగోపాల్‌ లేడీస్‌ మద్య విభేదాలా?

By:  Tupaki Desk   |   28 May 2019 5:30 PM GMT
నందగోపాల్‌ లేడీస్‌ మద్య విభేదాలా?
X
సూర్య హీరోగా సాయి పల్లవి మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్స్‌ గా సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎన్జీకే'. విభిన్నమైన పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య పొలిటీషియన్‌ గా కనిపించబోతున్నాడు. నందగోపాల్‌ పాత్రలో సూర్య కనిపించబోతుండగా ఆయన భార్య పాత్రలో సాయి పల్లవి నటించింది. ఇక మరో కీలక పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించింది. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో హీరోయిన్స్‌ ఇద్దరి మద్య విభేదాలు తలెత్తినట్లుగా తమిళ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సాయి పల్లవికి తనకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని.. షూటింగ్‌ సమయంలో కూడా తన కంటే ఆమెకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారంటూ రకుల్‌ అసహనం వ్యక్తం చేసిందట. అందుకే ప్రమోషన్‌ సమయంలో సాయి పల్లవితో కాస్త అటు ఇటుగానే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక సాయి పల్లవి కూడా రకుల్‌ తో అంతగా ఇంట్రాక్ట్‌ అయినట్లుగా అనిపించలేదు. తాజాగా ఈ విషయమై రకుల్‌ ను ప్రశ్నించగా సాయి పల్లవితో గొడవలు మీడియా సృష్టే అంటూ తేల్చి పారేసింది.

సాయి పల్లవి మాత్రం ఈ విషయంలో స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. సినిమాలో ఇద్దరి పాత్ర సమానంగానే ఉంటుందని.. ఇదరి పాత్రలు సినిమాకు చాలా కీలకంగా ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మరి సినిమా మే 31న విడుదలైతే కాని అసలు విషయం ఏంటీ అనేది తెలియదు. ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటే ఖచ్చితంగా గొడవలు వివాదాలు వస్తాయని అందరికి తెల్సిందే. అదే విధంగా నందగోపాల్‌ లేడీస్‌ మద్య కూడా విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.