Begin typing your search above and press return to search.

న‌డిగ‌రసంఘం గొడ‌వ‌లు మ‌ళ్లీ ప‌తాక స్థాయికి!

By:  Tupaki Desk   |   8 Dec 2020 4:35 AM GMT
న‌డిగ‌రసంఘం గొడ‌వ‌లు మ‌ళ్లీ ప‌తాక స్థాయికి!
X
త‌మిళ ఇండ‌స్ట్రీలో న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌లు ఏ స్థాయిలో అల‌జ‌డికి తెర‌లేపాయో తెలిసిందే. శ‌ర‌త్ కుమార్ న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న ద‌గ్గ‌రి నుంచి అక్క‌డ నిత్యం గొడ‌వ‌లు కొన‌సాగాయి. ఆ త‌రువాత జ‌రిగిన ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ గెలిచాకా ఇవి ప‌రాకాష్ట‌కు చేరుకున్నాయి. అప్ప‌టి నుంచి వ్య‌క్తిగ‌తంగా ఒక‌రినొక‌రు టార్గెట్ చేసుకోవ‌డం వ‌ర్గ పోరు మొద‌లైంది. విశాల్ ప్యానెల్ నుంచి నాజ‌ర్ అధ్య‌క్ష‌పీఠాన్ని ఎక్కారు. అయినా అల‌జ‌డి ... గొడ‌వ‌లు నిత్య‌కృత్యంగా మారాయి.

నాజ‌ర్ నాయ‌క‌త్వంలోనూ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ప‌దికోట్ల వ‌ర‌కు నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కోలీవుడ్ ‌లో కొత్త డ్రామా మొద‌లైంది. ఖ‌ర్చుల ప‌ద్దుల‌పై ఆరాలు తీస్తుండ‌డం.. సంఘానికి వ‌చ్చే రాబ‌డి ఖ‌ర్చులు ఎంత అనే లెక్క‌లు తేల్చాల‌ని స‌భ్యులు ప‌ట్టుబ‌ట్ట‌డంతో న‌డిగ‌ర్ సంఘం కార్యాల‌యంలో ర‌చ్చ ర‌చ్చ సాగుతోంది. స‌డెన్ గా ఊహించ‌ని ట్విస్టు. సంఘంలో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డం.. కీల‌క ఫైళ్లు అగ్నికి ఆహుతి కావ‌డంతో ఇదంతా కుట్ర‌లో భాగంగానే జ‌‌రిగింద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

లెక్క‌లు అడిగాం కాబ‌ట్టే ఆధారాలు లేకుండా చేయ‌డానికే అగ్ని ప్ర‌మాదం నాట‌కం ఆడార‌ని దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల్సిందే అంటూ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు. కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్న హీరో విశాల్ వ్య‌వ‌హార శైలిపై కూడా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఎటు ట‌ర్న్ తీసుకుంటుందోన‌ని కోలీవుడ్ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికైనా ఈ వివాదంపై క‌మ‌ల్- ర‌జ‌నీ స్పందించాల‌ని కోరుతున్నారు.