Begin typing your search above and press return to search.
భారమంతా దిల్ రాజు పైనే..ఎప్పటికి కరుణించేనో!
By: Tupaki Desk | 5 Nov 2022 3:30 PM GMTగతంలో దిల్ రాజు కాంపౌండ్ లో అవకాశం కోసం వంశీ పైడిపల్లి నుంచి వాసు వర్మ వరకు నెలల తరబడి.. ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఆ తరువాత కొంత మంది అవకాశాల్ని దక్కించుకున్నారు. కొంత మంది ఇప్పటికీ దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తూ వున్నారు. అందరిలాగే ఇప్పడు దిల్ రాజు కాంపౌండ్ లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇటీవల తన ఫామ్ ని కోల్పోతున్నాడు.
`గ్రహణం` సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఆయన `అష్టాచమ్మా` సినిమాతో తొలి కమర్షియల్ హిట్ ని దక్కించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. గోల్కొండ హై స్కూల్, `అంతకు ముందు ఆ తరువాత` వంటి సినిమా వరకు వరుసగా విజయాల్ని దక్కించుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
అయితే ఆయన ఇమేజ్ ని అల్లరి నరేష్ తో చేసిన `బందిపోటు` డ్యామేజ్ చేసింది. అంతే కాకుండా ఈ పసినిమా ఫలితంతో నిర్మాణ రంగం నుంచి ఇవీవీ సంస్థ శాశ్వతంగా తప్పుకునేలా చేసింది. అయితే `అమీ -తుమీ`, సమ్మోహనం సినిమాలు ఇంద్రగంటిని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చాయి. ఇదిలా వుంటే `సమ్మోహనం` సినిమాని సినిమా హీరోయిన్ కు, ఓ యువకుడికి మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో రూపొందించి సక్సెస్ అయిన ఇంద్రగంటి తాజాగాఅదే ఫార్ములాని వాడి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమాతో బ్లండర్ చేశాడు.
అంతకు ముందే నాని, సుధీర్ బాబుల కలయికలో `వి` అంటూ తనకు టచ్ లేని యాక్షన్ థ్రిల్లర్ ని ట్రై చేసి చేతులు కాల్చుకున్న ఇంద్రగంటి ఈ సినిమా తరువాత కూడా జాగ్రత్తపడకుండా మళ్లీ పాత కథనే మార్చి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అంటూ బ్లండర్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో తనతో సినిమా చేయడానికి ఇప్పడు ఏ హీరో సాహసించడం లేదు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో దిల్ రాజు ఓ మూవీని నిర్మించాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు.
కానీ కథ కుదరడం లేదు. ఇంద్ర గంటి వద్ద కథ వుంది..కానీ ఆయన ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకున్న విజయ్ దేవరకొండ తనతో ప్రయోగం చేయడానికి ఇష్టపడం లేదట. కారణం తను రీసెంట్ గా `లైగర్`తో భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకోవడమే నని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో దిల్ రాజు కాంపౌండ్ లో ఇంద్రగంటి మరో శ్రీరామ్ వేణులా వేచి చూడాల్సిందేనా..ఇంద్రగంటిని దిల్ రాజు ఎప్పటికి కరుణించేనో .. ఏ హీరోని తనకి అప్పగించేనో అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.