Begin typing your search above and press return to search.
#మా ఎన్నికలు.. స్పష్ఠంగా ఆ ఇద్దరే వారియర్స్
By: Tupaki Desk | 5 Sep 2021 5:30 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు క్రమశిక్షణా సంఘం ఎన్నికల తేదీని ప్రకటించడంతో ఇప్పటికే ఎవరికి వారు ప్రచారంలో తలమునకలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనంతగా ఈసారి విందు రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదారుగురు బరిలో నిలుస్తారని అంతా భావించారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరు తుది పోరుకు రెడీ అవుతారు? అన్నదానిపై స్పష్ఠత వచ్చేసింది.
ఈసారి పోటీ క్లారిటీగా ఆ ఇద్దరి మధ్యనే ఉంటుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వర్సెస్ యువహీరో మంచు విష్ణు మధ్య వార్ ఫిక్సయినట్టేనని భావిస్తున్నారు. నటి హేమ .. జీవిత రాజశేఖర్ మహిళా మణుల ఓట్లను చీలుస్తూ ఈసారి అధ్యక్ష పదవి రేసులో ఉంటారని భావిస్తే చివరికి ఆ ఇద్దరూ తప్పుకున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని ఎంచుకుని ఆ ఇద్దరూ పెద్ద షాకిచ్చారు. పదవి చేపట్టడమే ధ్యేయంగా తెలివైన ఎత్తుగడలతో ఆ ఇద్దరు కథ నడిపించేయడం చర్చనీయాంశమైంది.
దీనిని బట్టి ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మాత్రమే అధ్యక్ష పదవి పోటీలో ఉంటారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ని ప్రకటించారు. మంచు విష్ణు క్లారిటీగా ప్యానెల్ మెంబర్లను ప్రకటిస్తారు. ఇక ఈసారి రేసులో సీవీఎల్ అనే సీనియర్ నటుడు తెలంగాణ అంటూ డివైడ్ పాలిటిక్స్ ని నడిపించాలని చూసినా ఆయన గురించి అంతగా చర్చ సాగడం లేదు. మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ పోటీబరిలో ఉన్నారు కాబట్టి ఆయన ప్యానెల్ సంగతులేమిటో తెలియాల్సి ఉంటుంది.
ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ చిరంజీవి - నాగబాబు అండదండలున్నాయి. ఇతర మెగా హీరోలు అగ్ర తారల మద్దతు ఉంది. మంచు విష్ణుకు నందమూరి కృష్ణంరాజు- బాలకృష్ణ బృందం మద్దతు కూడా లభించింది. జయసుధ తరపున విష్ణుకు అండదండలు ఉంటాయి. ఇక ఈ ఎన్నికల్లో గత అధ్యక్షులు మురళీమోహన్ సహా ఇతరుల మద్ధతు ఎవరికి ఉండనుందో చూడాలి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తదితరుల మద్ధతు స్పష్టంగా నాగబాబు అండగా ఉన్న ప్రకాష్ రాజ్ కి ఉంటుంది.
ఎన్నికల ముందు సిత్రాలు..!
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో ఉన్నది కేవలం 950 మంది సభ్యులు మాత్రమే. కానీ ఇవి కూడా సాధారణ ఎన్నికల మాదిరిగా హీట్ ని పెంచడం చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ లో ఎన్నికలకు సమయమాసన్నమవ్వడంతో ఎవరికి వారు విందు రాజకీయాలు మొదలు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా ప్రచారం కానిచ్చేస్తున్నారు. ఈగోలు అలకలు గొడవలు అంటూ మా ఎన్నికల రచ్చ పీక్స్ కి చేరనుంది. ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులతో సాధారణ ఎన్నికల్లా గడబిడకు తెర తీసారు. ఎవరు గెలిచినా 2021-24 సీజన్ కి ఈసారి మా అధ్యక్ష కార్యవర్గం పాలన సాగించాల్సి ఉంటుంది. మేమంతా ఒకటే .. ఒకే తల్లి బిడ్డలం అని చెప్పుకునే మా సభ్యులంతా రాజకీయాలు పదవుల కోసం ఇంతగా వెంపర్లాడడం అన్నది ఆశ్చర్యపరుస్తోంది.
మా సొంత బిల్డింగ్ ప్రధాన ఎజెండా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజకీయాలు MAA శాశ్వత భవనం చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు సహా పలువురు మా సొంత భవంతి నిర్మాణంపైనే టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అధ్యక్షుడిగా గెలిపిస్తే ఈ సమస్యను తక్షణం పరిష్కరిస్తామని వీరంతా ప్రకటనలు చేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు శాశ్వత భవంతి నిర్మాణం కోసం తన సొంత డబ్బును వెచ్చిస్తానని ఎవరూ రూపాయి కూడా పెట్టాల్సిన పనే లేదని ప్రకటించడం సంచలనమే అయ్యింది. విష్ణు ఈ ప్రకటన చేయడమే కాదు ఏకంగా మూడు స్థలాలు వెతికి ప్రకాష్ రాజ్ బృందానికి సవాల్ విసిరాడు. మనమంతా ఆ మూడింటి నుంచి బెస్ట్ స్థలాన్ని ఎంపిక చేసుకుందాం అని అతడు ప్రకటించారు.
నిజానికి ప్రకాష్ రాజ్ ని సమర్థిస్తూ .. మా సొంత భవంతికి మంచు విష్ణు డబ్బు సర్ధినా కానీ స్థలం ఎలా తెస్తాడో చెప్పాలని నాగబాబు సవాల్ విసిరారు. దానికి సమాధానంగానే విష్ణు ఇలా కసరత్తు చేశారని అర్థమైంది. అయితే `మా`కు అసలు సొంత భవంతి అవసరమే లేదని బండ్ల గణేష్ అన్నారు. దానికంటే పేద ఆర్టిస్టులకు సొంత ఇల్లు కట్టివ్వాలని గణేష్ కోరారు. తాను శాశ్వత భవంతి నిర్మాణానికి వ్యతిరేకినని.. ఈ సంక్లిష్ట సమయంలో మంచి సంక్షేమ కార్యక్రమాలు చాలా అవసరమని బండ్ల అన్నారు.
మరోవైపు మా మెంబర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచు విష్ణు స్థలం వెతికేశారు కాబట్టి ఇక ప్రకాష్ రాజ్ వెళ్లి తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించాల్సిన అవసరం లేకపోవచ్చు. నాగబాబు ఛాలెంజ్ ని స్వీకరించి విష్ణు స్థల సేకరణ చేసినందుకు ఇప్పుడు అతడు భవంతి నిర్మాణానికి అయ్యే డబ్బును కూడా పెట్టే ఛాన్సుంటుంది. అటుపై ఇల్లు లేని `మా` పేద ఆర్టిస్టుల ఇంటి నిర్మాణానికి ప్రకాష్ రాజ్ సహ పలువురు సినీపెద్దలు సాయం చేస్తే బావుంటుందేమో అన్న వాదనను ఒక సెక్షన్ వినిపిస్తోంది.