Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో కుల పిచ్చి ఎలా ఉంటుందో తెలివిగా చెప్పారు!

By:  Tupaki Desk   |   1 Jun 2021 2:33 PM GMT
ఇండ‌స్ట్రీలో కుల పిచ్చి ఎలా ఉంటుందో తెలివిగా చెప్పారు!
X
స్టార్ రైట‌ర్ విజయేంద్ర ప్రసాద్ `అలీతో స‌ర‌దాగా` కార్య‌క్ర‌మంలో త‌న వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త విష‌యాల్ని షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా విష‌యాల‌పై ఆయ‌న ముచ్చ‌ట్లు వెబ్ లో వైర‌ల్ అయ్యాయి. అయితే ప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడూ డిబేట‌బుల్ అనిపించే కులం ప్ర‌స్థావ‌న తెచ్చారాయ‌న‌. క‌మ్మ కాపు అంటూ ఆయ‌న నోటి నుంచి వినిపించిన ఆ ప‌దాలపైనా తాజాగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

``నాది కమ్మ కాస్ట్ అండి , ఆ అమ్మాయి కమ్మ కాదని నాకు తెలుసు. నేను కులం గురించి ఎప్పుడూ అడ‌గ‌లేదు. కానీ ఒక‌రోజు స‌డెన్ గా మా చిరంజీవి అంది. ఏంటి మీ చిరంజీవి అన్నాను.. !! ఆయ‌న మా కాపు కులం క‌దా అండీ.. అని అంది.. ఆరోజు తెలిసింది !!`` అంటూ విజ‌యేంద్ర ప్ర‌సాద్ త‌న అనుభ‌వాన్ని వెల్ల‌డించే క్లిప్ ట్విట్ట‌ర్ లో వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రు? అంటే త‌న భార్య‌నే.. త‌న‌తోనే అలా సంభాషించారట‌.

తాను క‌మ్మ అయితే త‌న భార్య కాపు అని చెప్పారు విజ‌యేంద్ర ప్ర‌సాద్. తాను కులం గురించి ప్ర‌శ్నించ‌లేద‌ని కానీ త‌నంత‌ట తానే చెప్పార‌ని కూడా ఆయ‌న అన్నారు. ఏదేమైనా ఈ సంభాష‌ణ‌తో ఇండ‌స్ట్రీలో మ‌నుషులు ఎలా ఉంటారో ఇక్క‌డ కులం గురించి ఎలా ప్ర‌స్థావిస్తారో ఆయ‌న తెలివిగానే వివ‌రించారు. ఇంకా త‌న లైఫ్ ఎమోష‌న్ ని ఓపెన‌య్యారు. త‌న భార్య ఆరు నెలలు కోమాలోకి జారిపోయిందని పేర్కొంటూ విజ‌యేంద్రుడు ఎమోష‌న‌ల్ అయ్యారు. గుండెనొప్పితో ఆమె కన్నుమూశారు. ఆమె రాజమౌళి విజయాన్ని కొంచెం చూసినా.. బాహుబలి తర్వాతా తాను ఉండి ఉంటే అది చాలా అరుదైన‌ క్షణం అయ్యేదని ఆవేద‌న చెందారు.