Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్' క్లైమాక్స్ ని అలా ప్లాన్ చేశారా..?

By:  Tupaki Desk   |   3 March 2022 3:30 AM GMT
రాధేశ్యామ్ క్లైమాక్స్ ని అలా ప్లాన్ చేశారా..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామాని 2022 మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

ఇప్పటికే 'రాధే శ్యామ్' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చింది. అదే సమయంలో చిత్ర నేపథ్యం ఏంటని అనేక ఊహాగానాలు పుట్టించింది. ఇందులో ఎలాంటి ఫైట్స్ లేవని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు.

'రాధే శ్యామ్' పోస్టర్లు మరియు ట్రైలర్‌ ను బట్టి, ఈ చిత్రానికి విలక్షణమైన విలన్ లేడని దాదాపు ధృవీకరించబడింది. కాకపోతే లేటెస్టుగా వచ్చిన రిలీజ్ ట్రైలర్ ని బట్టి జగపతిబాబు పాత్రలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయేమో అని సందేహాలు వ్యక్తం అయ్యాయి.

అయినప్పటికీ ఈ సినిమాలో హీరోహీరోయిన్ల కలయికకు 'విధి' అడ్డంకిగా మారుతుందని అర్థం అవుతోంది. ఇది ప్రేమకు విధికి మధ్య జరిగే యుద్ధమని రాధేశ్యామ్ మేకర్స్ చెబుతూ వస్తున్నారు. విక్రమాదిత్య అనే పామిస్ట్ పాత్ర‌లో కనిపించనున్న ప్రభాస్.. ప్రేరణ (పూజా హెగ్డే) అనే యువతితో పడతాడు.

అయితే వీరి ప్రేమ కథకి అడ్డుగా అస్థిరమైన విధి వస్తుందని.. దీన్ని ఎదిరించారా లేదా అనేది 'రాధే శ్యామ్' చిత్రంలో ఆకట్టుకునేలా చెప్పబడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సునామీ బ్యాక్‌ డ్రాప్‌ తో సాగే ఈ చిత్రం విషాదాంతంగా ముగియనుందని రూమర్స్ వస్తున్నాయి.

'రాధే శ్యామ్' సినిమాలో కేవలం ప్రేమ కథే కాదు.. అంతకుమించి ట్విస్టులు ఉన్నట్లు.. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ చెబుతున్నారు. లేటెస్టుగా వచ్చిన రిలీజ్ ట్రైలర్ మూవీపై అంచనాలు రెట్టింపు చేసింది. ఇది కచ్చితంగా ప్రభాస్ కెరీర్ లో నిలిచిపోయే సినిమా అవుతుందని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కృష్ణంరాజు సమర్పణలో గోపీ కృష్ణ మూవీస్‌ తో కలిసి యూవీ క్రియేషన్స్‌ - టీ సిరీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కృష్ణంరాజు - భాగ్యశ్రీ - మురళీ శర్మ - సచిన్‌ ఖేడ్‌కర్‌ - జయరామ్ - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ కీలక పాత్రలు పోషించారు.

జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్‌.రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో 'రాధేశ్యామ్' మూవీ రిలీజ్ కానుంది.