Begin typing your search above and press return to search.

ఓ బేబీని టెన్షన్ పెడుతోందదే

By:  Tupaki Desk   |   3 July 2019 4:55 AM GMT
ఓ బేబీని టెన్షన్ పెడుతోందదే
X
ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఓ బేబీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దీని మీద గట్టి చూపే వేసేలా ఉన్నారు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం ఆడియో కు మంచి రెస్పాన్స్ రావడం అన్ని శుభ శకునాలలాగే ఉన్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం ఓ బేబీ టీంని టెన్షన్ పెడుతోందట. అదే క్లైమాక్స్.

చాలా ఎంటర్ టైనింగ్ గా మొదలుపెట్టి కొన్ని ఊహించని ట్విస్టులు ఇచ్చి చివర్లో మాత్రం కొంత ఉస్సురనిపించే తరహాలో ఫినిషింగ్ ఉందనే గాసిప్ ఇప్పుడు చర్చలోకి వస్తోంది. ఇదే విషయమై సురేష్ బాబు కొంత అసంతృప్తికి గురైతే దర్శకురాలు నందిని రెడ్డి హీరోయిన్ సమంతా సర్దిచెప్పారని అయినా దాని మీద ఆయనకు పూర్తి అనుమానాలు తొలగిపోలేదని గతంలోనే ఓ వార్త వచ్చింది

ఇప్పుడిది నిజమో కాదో రిలీజయ్యాక తెలుస్తుంది కానీ ప్రమోషన్ బాగా చేయడం పోటీగా ఇంకే గట్టి సినిమా లేకపోవడం చూస్తుంటే రెవిన్యూ పరంగా ఓ బేబీ ఈజీగా సేఫ్ జోన్ లోకి వెళ్లేలా కనిపిస్తోంది. కాకపోతే పెద్ద రేంజ్ కు వెళ్లకుండా క్లైమాక్స్ ప్రభావం చూపిస్తుందేమోనన్న అనుమానాలు ఉన్నాయట.

కొరియన్ మూవీ మిస్ గ్రానీకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఓ బేబీలో నాగ శౌర్య హీరో కాగా రాజేంద్ర ప్రసాద్ రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ నటి లక్ష్మి పెర్ఫార్మన్స్ కూడా ఇందులో కీలకంగా మారబోతోంది. మజిలీ తర్వాత దాన్ని మించిన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సామ్ కు ఓ బేబీ ఎలాంటి ఫలితం ఇస్తుందో 5న తేలిపోతుంది