Begin typing your search above and press return to search.
'క్లైమాక్స్' ట్రైలర్: నటకిరీటి నటించిన సెటైరికల్ థ్రిల్లర్..!
By: Tupaki Desk | 20 Feb 2021 1:19 PM GMTనటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ''క్లైమాక్స్''. సెటైరికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ - శివ శంకర్ మాస్టర్ - శ్రీరెడ్డి - సాషా సింగ్ - రమేష్ - చందు ఇతర కీలక పాత్రలు పోషించారు. 'డ్రీమ్' సినిమాతో పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డ్స్ అందుకున్న కె.భవాని శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజేశ్వర్ రెడ్డి - కె.కరుణాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఫిబ్రవరి 27న ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ట్రైలర్ ని తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ 'విజయ్ మోడీ' అనే ధనవంతుడి పాత్ర పోషించాడని తెలుస్తోంది. సినిమా తీయాలి - పాపులర్ అవ్వాలి - పొలిటీషియన్ అవ్వాలి అనే మూడు గోల్స్ పెట్టుకుని జీవించే రిచ్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. 'బిచ్చగాడికైనా బిల్ గేట్స్ కైనా కష్టాల్లో తేడా ఉండదు' అంటూ చెప్పే డైలాగ్ తో డబ్బున్న వ్యక్తి అయినప్పటికీ అతనికి ఏదో కష్టం ఉందని అర్థం అవుతోంది. మొత్తం మీద 'డ్రీమ్' అనే సైకాలాజిక్ థ్రిల్లర్ తీసిన భవానీ శంకర్.. ఈసారి కామెడీ, లవ్, ఫామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్ ఇలా మల్టీ జానర్ కథతో వస్తున్నాడని తెలుస్తోంది. 'క్లైమాక్స్' చిత్రానికి రాజేష్ నిధివన సంగీతం అందించగా రవికుమార్ నీర్ల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు.