Begin typing your search above and press return to search.
గవర్నర్ కు సీఎం వార్నింగ్..మాతో పెట్టుకోకు!
By: Tupaki Desk | 13 Jan 2019 5:58 AM GMTఔను. సాక్షాత్తు గవర్నర్ కు అదే రాష్ర్టానికి చెందిన ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు! దీంతో గవర్నర్ గారు సైతం తగు రీతిలోనే స్పందించారు!! అసలే ఉప్పునిప్పుగా ఉన్న పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి - రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీల మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. తన ప్రభుత్వంతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించగా - హుందాగా మాట్లాడాలంటూ గవర్నర్ కిరణ్ బేడీ చురకలంటించారు. ఈ ఎపిసోడ్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా పుదుచ్చేరి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా గిఫ్టు ప్యాకెట్లు అందజేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే, ఇది వాయిందా పడింది. దీనిపై ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. మద్రాస్ హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఈ పథకానికి మోకాలడ్డుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు. తన ప్రభుత్వంతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అయిన ముఖ్యమంత్రి నారాయణస్వామి హెచ్చరించారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలను కిరణ్ బేడీ కొట్టిపారేశారు. వ్యక్తిగతంగా తాను ఎవరికీ భయపడే రకం కాదని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడు సర్కారు అక్కడి నిరుపేదలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందని - కానీ మద్రాస్ హైకోర్టు దీన్ని అడ్డుకుందని ఆమె గుర్తుచేశారు. న్యాయస్థానం ఆదేశాలనే తాను పాటిస్తున్నానని గవర్నర్ స్పష్టం చేశారు.