Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో కంచరపాలెం రచ్చ!

By:  Tupaki Desk   |   9 Sep 2018 6:41 AM GMT
ఓవర్సీస్ లో కంచరపాలెం రచ్చ!
X
ఈ తెలుగు సినిమాకేమైంది.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో కొత్త సినిమాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనాలు 'గూఢచారి'.. 'RX 100' హ్యంగోవర్ నుండి బయటకు రాకముందే 'C/o కంచరపాలెం' సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కు మునుపే స్పెషల్ ప్రీమియర్స్ చూసినవాళ్ళు మెచ్చుకోవడంతో ప్రేక్షకులలో ఆసక్తి క్రియేట్ చేసిన ఈ సినిమాకు రిలీజ్ తర్వాత మంచి రివ్యూస్ వచ్చాయి. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్స్ కూడా ప్రశంసించడంతో ఇప్పుడు అందరి దృష్టి కంచరపాలెం పై పడింది.

యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కంచరపాలెం సందడి తెచ్చింది. ఈ శుక్రవారం నాడు మూడు సినిమాలు రిలీజ్ అయితే వాటిలో కంచరపాలెం ఒక్కటే డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మొదటి రోజు 55 వేల డాలర్లతో స్టార్ట్ అయింది. ఇక శనివారం కలెక్షన్స్ ఇంకా మెరుగయ్యాయి. శనివారం టోటల్ ఫిగర్స్ రాకముందే 'కంచరపాలెం' టోటల్ కలెక్షన్స్ $120K దాటడం విశేషం. సినిమా బడ్జెట్ తక్కువ కావడంతో ఈ కలెక్షన్స్ నంబర్స్ నిర్మాతలకు సంతోషాన్నిచ్చేవే.

మరోవైపు శుక్రవారం విడుదలయిన మరో చిత్రం 'మను' ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఆసక్తి రేకెత్తించింది గానీ బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ గొప్పగా లేదు. అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసినప్పటికీ అన్నీ సెక్షన్ల ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే కాన్సెప్ట్ కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ కాస్త డల్ గా ఉంది. ఇక 'సిల్లీ ఫెలోస్' కలెక్షన్స్ సిల్లీగానే ఉన్నాయి.