Begin typing your search above and press return to search.
కోబ్రా ఆడియోకి చియాన్.. ఆ వార్తలకు ఇలా చెక్!
By: Tupaki Desk | 9 July 2022 2:30 PM GMTచియాన్ విక్రమ్ కి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారన్న ప్రచారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడు సహా తెలుగు నాట ఆయన అభిమానులు చాలా కంగారు పడ్డారు. కానీ ఇంతలోనే అతడికి గుండెపోటు రాలేదని.. క్షేమంగా ఉన్నారని విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ స్పష్టం చేసాక ఆందోళన నుంచి బయటపడ్డారు. చియాన్ విక్రమ్ ఆస్పత్రిలో చేరిన మాట నిజమే.. చిన్న నిలత.. చికిత్సతో కోలుకున్నారని కూడా అనంతరం మేనేజర్ వెల్లడించారు.
ఇంతలోనే అతడు త్వరలో ఓ ఆడియో వేడుకలో సందడి చేయనున్నారన్న వార్త అందింది. విక్రమ్ కథానాయకుడిగా అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ `కోబ్రా` ఆడియోను జూలై 11న ఆవిష్కరించనున్నారు. ఈ వేదికపై విక్రమ్ సందడి చేస్తారని తెలుస్తోంది. సూర్యనారాయణన్ అధికారికంగా క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా విక్రమ్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలకాలని యూనిట్ ఇలా ప్లాన్ చేసిందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ట్వీట్ చేస్తూ-``జులై 11న చెన్నైలోని ఫీనిక్స్ మార్కెట్ సిటీలో చియాన్ విక్రమ్ సమక్షంలో `కోబ్రా` గ్రాండ్ ఆడియో లాంచ్ కి రెడీ అవుతున్నాం. మనం అంతా అక్కడ కలుద్దాం`` అని వ్యాఖ్యానించారు.
గుండెపోటు రావడంతో కావేరి ఆసుపత్రిలో విక్రమ్ ను చేర్చారని మీడియాలోని ఒక వర్గం శుక్రవారం నాడు కథనాలు వెలువరించింది. కానీ అది గుండె పోటు కాదు.. విక్రమ్ కు ఛాతీలో తేలికపాటి అసౌకర్యం మాత్రమే ఉందని దానికి డాక్టర్లు చికిత్స చేస్తున్నారని విక్రమ్ మేనేజర్ స్పష్టం చేశారు. ఒక రోజులో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కూడా అతడు స్పష్టం చేశారు.
ఆ సాయంత్రమే కావేరి హాస్పిటల్స్ విడుదల చేసిన ప్రకటన తో అతడి వివరణ సరైనదేనని అందరికీ అర్థమైంది. ఇంతకుముందు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన ఘటన అభిమానులు సహా ప్రజల్ని తీవ్రంగా కలచి వేసిన సంగతి తెలిసిందే. తమ ఫేవరెట్ స్టార్ల విషయంలో ఏం జరిగినా అభిమానులు తీవ్రంగా కలత చెందుతారు. చియాన్ విషయంలోనూ అదే జరిగింది.