Begin typing your search above and press return to search.
'కోబ్రా' మూవీ రివ్యూ
By: Tupaki Desk | 31 Aug 2022 2:35 PM GMTచిత్రం : కోబ్రా
నటీనటులు: విక్రమ్-శ్రీనిధి శెట్టి-రోషన్ మాథ్యూ-మృణాళిని రవి-ఇర్ఫాన్ పఠాన్-కె.ఎస్.రవికుమార్-రోబో శంకర్-మీనాక్షి గోవిందరాజన్-ఆనంద్ రాజ్-జాన్ విజయ్ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం: భువన్ శ్రీనివాసన్-హరీష్ కన్నన్
నిర్మాత: ఎస్.ఎస్.లలిత్ కుమార్
రచన-దర్శకత్వం: అజయ్ జ్ఞానముత్తు
విలక్షణ పాత్రలు.. నటనకు కేరాఫ్ అడ్రస్ అనదగ్గ సీనియర్ తమిళ హీరో విక్రమ్.. తన స్థాయికి తగ్గ విజయాన్నందుకుని చాలా కాలం అయిపోయింది. 'అపరిచితుడు' తర్వాత అతడి కెరీర్లో నిఖార్సయిన హిట్టే లేదు. ఎన్నో పాత్రలు, కథలు ప్రయత్నించి విఫలమైన అతను.. డిమాంటి కాలనీ, ఇమైక్క నోడిగల్ (తెలుగులో అంజలి ఐపీఎస్) లాంటి హిట్ సినిమాలు తీసిన యువ దర్శకుడుతో జట్టు కట్టాడు. వీరి కలయికలో తెరకెక్కిన చిత్రమే.. కోబ్రా. విక్రమ్ మార్కు డిఫరెంట్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రమైన విక్రమ్ కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి.
కథ:
మది (విక్రమ్) ఒక గణిత ఉపాధ్యాయుడు. పైకి ఇదే అతడి వృత్తి అయినప్పటికీ.. అతను మారు వేషాల్లో పెద్ద పెద్ద నేరాలు చేస్తుంటాడు. ఒరిస్సా ముఖ్యమంత్రిని.. స్కాట్లాండ్ రాకుమారుడిని.. ఇలా ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ వెళ్తుంటాడు. ఈ హత్యలకు తన గణిత నైపుణ్యాన్నే ఉపయోగిస్తుంటాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఈ హత్యల వెనుక ఒక కనెక్షన్ ఉందని కనిపెట్టిన ఇంటర్ పోల్ అధికారి అస్లాం (ఇర్ఫాన్ పఠాన్) వీటి వెనుక సూత్రధారి ఎవరో కనుక్కునేందుకు యూరప్ నుంచి ఇండియాకు వస్తాడు. మరి అతను మది గుట్టును కనిపెట్టాడా.. అసలు మది నేపథ్యం ఏంటి.. అతనీ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నాడు.. అతడి లక్ష్యమేంటి.. అన్న విషయాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
ఒక హీరో రకరకాల వేషాలు వేసి.. మేకప్ తో మాయాజాలం చేస్తే.. థ్రిల్లయిపోయి ఎగబడి చూసే రోజులు ఎప్పుడో పోయాయి. అలాంటి వేషాలపై ఉండే ఆసక్తిని 'దశావతారం'తో కమల్ హాసన్ దాదాపుగా చంపేశాడని చెప్పాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. ఆ సినిమాలో అవసరానికి మించి పాత్రలు.. వాటికి చిత్ర విచిత్రమైన మేకప్ లు చూసి జనాలకు మొహం మొత్తేసింది. మనం చూస్తున్నది ఫలానా నటుడు అని గుర్తు పట్టలేని విధంగా.. రూపమే మారిపోయేలా మేకప్ వేసుకున్నాక ఆ పాత్రను ఆ యాక్టరే చేయాల్సిన అవసరం ఏముందన్నది ప్రశ్న. ఇలా కష్టపడి గంటల తరబడి మేకప్ వేసుకున్న ఆ నటుడి ఓపికను మెచ్చుకోవాలి.. అలా తీర్చిదిద్దిన మేకప్ మ్యాన్ ను అభినందించాలే తప్ప అందులో ఆ నటుడి 'టాలెంట్' అయితే ఏమీ కనిపించదు. ముందే అన్నట్లు కేవలం ఇలా హీరో రకరకాల వేషాల్లో కనిపించినంత మాత్రాన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయిే రోజులు కావివి. ఆ వేషాలు కథకు అవసరం అనిపించాలి. వాటితో ప్రేక్షకులను థ్రిల్ చేయాలి. అలా కాకుండా హీరో గొప్పదనాన్ని చాటడానికో.. ఇలా వేషాలేస్తే జనాలు ఎగబడిపోతారన్న భ్రమతోనో వాటిని కథలో ఇరికిస్తే జనాలకు చిర్రెత్తుకొస్తుంది. 'కోబ్రా' సినిమాలో సరిగ్గా అదే జరిగింది. ఏదో చేసేయాలన్న తపనలో తెరపై అసలేం చూపిస్తున్నారో అర్థం కాని గందరగోళంతో ఆద్యంతం ప్రేక్షకుడిని అసహనానికి గురి చేస్తూ మూడు గంటల పాటు నరకం చూపిస్తుంది 'కోబ్రా'.
'డిమాంటి కాలనీ'.. 'ఇమైక్క నోడిగల్' లాంటి చిత్రాలతో తన టాలెంట్ ఏంటో చూపించాడు యువ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. ఆ సినిమాలు చూసిన వాళ్లు విక్రమ్ లాంటి గొప్ప నటుడితో అజయ్ సినిమా అనగానే భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఐతే తన శైలిలో అతను ఒక పకడ్బందీ థ్రిల్లర్ తీసే ప్రయత్నం చేస్తే ఏ ఇబ్బంది లేకపోయేది. కానీ విక్రమ్ అనగానే అతడి శైలికి తగ్గట్లుగా వేరియేషన్లు చూపించాలి.. తనతో రకరకాల వేషాలు వేయించాలి.. సినిమా మొత్తం అతనే హైలైట్ అయిపోవాలి.. అన్న ఆలోచనలతో 'కోబ్రా' స్క్రిప్టు రాయడం మొదలుపెట్టినట్లున్నాడు. వీటి చుట్టూ తిరిగిన అతడి ఆలోచనలు.. తనను కుదురుగా కథ రాయనిచ్చినట్లు లేదు. అసలు కథకు అసవరమా లేదా.. ఇందులో లాజిక్ ఉందా లేదా అని చూడకుండా ఇష్టానుసారం అతను సన్నివేశాలను పేర్చుకుంటూ పోయాడు. 'గణితాన్ని ఉపయోగించుకుంటూ హత్యలు చేసే టీచర్' అనే థాట్ వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది కానీ.. తెరపై దాని చుట్టూ సన్నివేశాలను నడిపిన తీరు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. చాలా వరకు సన్నివేశాలు కృత్రిమంగా తయారవడంతో ప్రేక్షకుల్లో అసలు ఎగ్జైట్మెంటే కలగదు. ఎంతసేపూ హీరో జీనియస్ హీరో జీనియస్ అని వేరే పాత్రలతో చెప్పించి నమ్మించడానికి ప్రయత్నిస్తారే తప్ప.. అబ్బా ఏం చేశాడ్రా అని ప్రేక్షకులు ఫీలై హీరో పాత్ర పట్ల అడ్మిరేషన్ కలిగేలా చేయలేకపోయారు. మారు వేషాల్లో హీరో చేసే హత్యల వెనుక కారణాలేంటో.. అతను ఇలా ఎలా చేయగలుగుతున్నాడో సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు దర్శకుడు.
కాకపోతే సినిమాలో ఏవైనా చెప్పుకోదగ్గ అంశాలు ఉన్నాయంటే హీరో వేషాలు మారుస్తూ హత్యలు చేసే ఎపిసోడ్లే. వాటిని మినహాయిస్తే.. 'కోబ్రా'లోఅన్నీ ప్రేక్షకులకు సహనాన్ని పరీక్షించే ఎపిసోడ్లే మిగిలాయి. హీరో నేపథ్యం ఏంటో తెలియనంత వరకు దాని గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. నిగూఢంగా కనిపించే హీరో పాత్ర పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర హీరో ఒకడు కాదు ఇద్దరు అని చూపించి.. ద్వితీయార్ధం మీద ఆసక్తి రేకెత్తించగలిగాడు దర్శకుడు. కానీ హీరో ఫ్లాష్ బ్యాక్ మొదలైన కాసేపటికే.. అందులోని డ్రామాను.. గందరగోళాన్ని భరించడం కష్టమవుతుంది. ఇక హీరో చుట్టూ ఉండే ఊహా ప్రపంచం చుట్టూ నడిపిన సన్నివేశాలైతే ప్రేక్షకులకు థియేటర్ నుంచి పారిపోవాలనే ఆలోచన రేకెత్తిస్తాయి. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఇంతగా హింసించే సన్నివేశాలు ఏ పెద్ద సినిమాలోనూ లేవు అంటే అతిశయోక్తి కాదు. 'అపరిచితుడు' తరహలో సైకలాజికల్ టచ్ ఉన్న థ్రిల్లర్ లాగా 'కోబ్రా'ను తీర్చిదిద్దాలని దర్శకుడు చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టేసింది. ద్వితీయార్ధం మొదలైన కాసేపటికే పూర్తిగా 'కోబ్రా'తో డిస్కనెక్ట్ అయిపోయే ప్రేక్షకులు ఎక్కడో ఏదో మెరుపో మలుపో ఉంటుందని చూసి చూసి చివరికి తీవ్ర నిరాశకే గురవుతారు. ఏదో ప్రేక్షకుల మీద పగ ఉన్నట్లుగా ఇంత గందగరోళంతో నడిచే సినిమాను మూడు గంటలకు పైగా నిడివితో థియేటర్లకు వదిలేయడం దారుణం. బహుశా దర్శకుడు తాను షూట్ చేసిన రష్ అంతా చూసుకుని.. తాను ఏం తీశానో అర్థం కాక.. దాన్ని ఎలా ఎడిట్ చేయాలో కూడా పాలుపోక అలాగే వదిలేశాడేమో అనిపిస్తుంది.
నటీనటులు:
విక్రమ్ నట ప్రతిభ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఏ పాత్రనైనా అతను బాగా చేస్తాడు. కాకపోతే అతి సామాన్యమైన పాత్రల్లోనూ అద్భుతంగా నటించే అతడికి వేషాలేసి మెప్పించాల్సిన అవసరం ఏముంటుంది? ఈ మోజు అతడికి ఎప్పుడు వదులుతుందో అని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. కానీ అతను మాత్రం ఆ దారి వదలట్లేదు. 'కోబ్రా' కోసం అతను చాలా వేషాలే వేశాడు. అవేవీ అంత గొప్పగా అనిపించలేదు. కొన్ని వేషాలైతే చాలా ఇబ్బంది పెట్టాయి కూడా. ఆ వేషాలను పక్కన పెడితే.. ద్విపాత్రాభినయంలో విక్రమ్ చూపించిన వేరియేషన్ ఆకట్టుకుంటుంది. తన నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. సినిమాలో అతను కాకుండా ఇంకెవరూ అంతగా హైలైట్ కాలేదు. టాలెంటెడ్ మలయాళం యాక్టర్ రోషన్ మాథ్యూ విలన్ పాత్రలో సాధారణంగా అనిపించాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి (కేజీఎఫ్ ఫేమ్) ప్రత్యేకత ఏమీ కనిపించలేదు ఇందులో. తన పాత్ర అంత సాధారణంగా ఉంది. ఒకట్రెండు సన్నివేశాల్లో తన హావభావాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్ పోల్ అధికారి పాత్రకు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను ఏరి కోరి ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాదు. అందులో ఎవరున్నా ఒకటే అన్నట్లుగా నటించాడతను. కేఎస్ రవికుమార్.. రోబో శంకర్.. మృణాళిని రవి.. మీనాక్షి.. వీళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
'కోబ్రా'కు సంగీత దర్శకుడు ఎవరో తెలియకుండా పాటలు.. నేపథ్య సంగీతం విని.. ఆ తర్వాత దీనికి ఏఆర్ రెహమాన్ పని చేశాడని తెలిస్తే ఆయన అభిమానులు షాకవకుండా ఉండలేరు. కొన్నేళ్ల నుంచి తీవ్రంగా నిరాశ పరుస్తున్న రెహమాన్ సినిమాల జాబితాలోకి 'కోబ్రా' కూడా చేరుతుంది. పాటల్లో ఒక్కటీ రిజిస్టర్ అయ్యేలా లేవు. పాటలొచ్చినపుడల్లా కాసేపు అలా బయటికి వెళ్లి రిలీఫ్ అవుదామనిపించే స్థాయిలో ఉన్నాయి. నేపథ్య సంగీతం అక్కడక్కడా పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకు భువన్ శ్రీనివాసన్.. హరీష్ కన్నన్ అనే ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పని చేశారు. గజిబిజిగా అనిపించే ఛాయాగ్రహణంతో ఎవరి స్థాయిలో వాళ్లు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించారు. బహుశా ఇందులో ఛాయాగ్రాహకుల తప్పు కూడా లేకపోవచ్చు. వాళ్లు దర్శకుడి అభిరుచి మేరకే పని చేసి ఉండొచ్చు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. విక్రమ్ ఫామ్.. మార్కెట్ ఎంత డౌన్ అయినప్పటికీ.. సినిమా మీద భారీగానే ఖర్చు పెట్టారు. ఆ ఖర్చంతా తెరపై కనిపిస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఏదో చేయాలనే తపనలో అసలేం చేస్తున్నాడో అర్థం కాని విధంగా ఔట్ పుట్ ఇచ్చాడు. రైటింగ్.. టేకింగ్ అన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. అసలు ఈ కథను విక్రమ్ కు ఎలా చెప్పి ఒప్పించాడో కానీ.. తెరపై చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం అతడి నరేషన్ దెబ్బకు బుర్ర బద్దలైపోతుంది. చాలా కష్టపడ్డాడు అనే సానుభూతి ఉన్నా.. అసలేం చెప్పదలుచుకున్నాడో అర్థం కాని విధంగా మూడు గంటల పాటు పెట్టిన ప్రయాసకు దర్శకుడిని మన్నించలేం.
చివరగా: కోబ్రా.. కాటు తప్పదు
రేటింగ్-1.75/5