Begin typing your search above and press return to search.
కలెక్షన్ల దుమారం.. 1000 కోట్ల క్లబ్ లో KGF 2
By: Tupaki Desk | 25 April 2022 4:07 AM GMTమనిషికి నిగ్రహం అనేది చాలా అవసరం. దాంతో ఎలాంటి విజయాల్ని అయినా సాధించగలమని చాలామంది నిరూపించారు. ఒకప్పుడు మునులు మహర్షుల తపస్సు గురించి నిగ్రహం గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ల నిగ్రహం తపస్సు గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. కరోనా ప్రకంపనాల తర్వాత వరుసగా రెండు 1000 కోట్ల క్లబ్ సినిమాలు ప్రాంతీయ భాషల నుంచి రావడం సంచలనంగా మారింది.
ఆర్.ఆర్.ఆర్ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి దర్శకధీరుడు రాజమౌళి తపస్సు కారణం అనుకుంటే .. ఇప్పుడు కేజీఎఫ్ 2 చిత్రం కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ కారకుడు. కేజీఎఫ్ 2 చిత్రాన్ని అతడు తెరకెక్కించిన విధానం ప్రధానంగా చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా ఎంపిక చేసుకున్న స్టోరీలో ఒరిజినాలిటీ.. మేకింగ్ లో యూనిక్ థాట్స్.. అత్యున్నత సాంకేతికతను అతడు వినియోగించిన విధానం .. హీరోయిజం ఎలివేషన్.. ఇలా అన్ని కోణాల్లో కేజీఎఫ్ 2 చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఆస్కార్ విన్నర్ 300 సహా ఎన్నో హాలీవుడ్ సినిమాల తీరుగా కేజీఎఫ్ 2 కూడా సాంకేతికంగా ది బెస్ట్ గా కనిపించింది.
ఇక కేజీఎఫ్ ఇంత గొప్పగా ఆడుతుంటే మునీశ్వరుడిలా సైలెంట్ గా ఉన్నాడు ప్రశాంత్ నీల్. 100 కోట్ల క్లబ్ 200 కోట్ల క్లబ్ 300 కోట్ల క్లబ్ 500 కోట్ల క్లబ్ అంటూ అభిమానుల్లో చిత్రపరిశ్రమ ప్రముఖుల్లో బోలెడంత చర్చ సాగుతుంటే అతడికి ఇదేమీ పట్టని వ్యవహారంగా మారింది. ఇప్పుడు ఏకంగా కేజీఎఫ్ 2 చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికి కానీ మునీశ్వరుడు తపస్సును చాలించలేదు. నిగ్రహాన్ని కొనసాగిస్తూనే చివరకు తన టీమ్ తో కలిసి ప్రశాంత్ నీల్ సెలబ్రేషన్ మోడ్ లోకి వచ్చాడు. ఇన్నాళ్లు అతడు సక్సెస్ మీట్ల పేరుతో అనవసర హంగామానే చేయలేదు.
అతడు చాలా కాలంగా పూర్తిగా మౌనం వహించాడు. సినిమా గొప్పగా ఆడుతుంటే ఇంకా ఇంకా హంగామా సృష్టించాలని భావించే రొటీన్ మేకర్స్ కి అతడు డిఫరెంట్ అని ప్రూవైంది. KGF2 దేశ విదేశాల్లో హాట్ టాపిక్ గా మారినా కానీ.. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ దా సెటబ్రేషన్ మోడ్ లోకి రానేలదు ఇక ఎట్టకేలకు అతడుడు తన హీరో నిర్మాతతో కలిసి కేక్ కట్ చేశారు. హీరో యష్ - హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ లతో కలిసి ప్రశాంత్ నీల్ సక్సెస్ వేడుకలో కనిపించారు.
వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం ప్రాంతీయ భాషలు విదేశాల నుంచి ఏకంగా 700 కోట్లు వసూలు చేయగా.. కేవలం బాలీవుడ్ నుంచే 300 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గలేదు. మునుముందు చాలా సినిమాల రికార్డుల్ని కేజీఎఫ్ 2 బ్రేక్ చేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. మొదటి రోజు వసూళ్లలోనూ బాలీవుడ్ లో బెస్ట్ చిత్రంగా కేజీఎఫ్ 2 నిలిచిన సంగతి తెలిసిందే. నిజానికి ఇంతటి విజయం సాధించినా కానీ ప్రశాంత్ లో ఎక్కడా తొణికిసలాట అనేది కనిపించలేదు. ప్రపంచానికి అతడు ఇప్పుడు మునీశ్వరుడిలానే కనిపిస్తున్నారు. కొందరు మాత్రమే ఇలా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.