Begin typing your search above and press return to search.
ఎఫ్ 3 రెండు రోజుల వసూల్ ఎంత?
By: Tupaki Desk | 29 May 2022 7:31 AM GMTవిక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ F3 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రం ఆరంభం మిశ్రమ సమీక్షలను అందుకున్నా ఓపెనింగ్ వీకెండ్ చక్కని వసూళ్లను సాధిస్తోందని టీమ్ చెబుతోంది. చక్కని కామెడీ టింజ్ తో రక్తి కట్టించే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మునుముందు థియేటర్లకు రప్పిస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.
మొదటి భాగం మానవసంబంధాలు భార్యా భర్తల చిరాకులు పరాకులకు సంబంధించిన కథాంశంతో రూపొందింది. అయితే మానవ జీవితం డబ్బుతో ముడిపడి ఎలా సాగుతుందో తెలిపే ప్రయత్నం రెండో భాగంలో కనిపించింది. డబ్బు జబ్బు.. అది లేకపోతే నిరాశ ఎలా అలుముకుంటుందో అనీల్ రావిపూడి తెరరూపం ఇచ్చారన్న ప్రశంస దక్కింది.
ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణా రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమా 10.35 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు 8 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రానికి తమన్నా- మెహ్రీన్- సోనాల్ చౌహాన్ ల గ్లామర్ ప్రధాన అస్సెట్. సునీల్- అలీ- ప్రగతి- ప్రదీప్- రఘుబాబు- మురళీ శర్మ- అన్నపూర్ణమ్మ- వై విజయ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు- శిరీష్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
#F3 మూవీ డే2 వసూళ్ల వివరాలు
AP/TS షేర్ పరివీలిస్తే.. నైజాం 4.1 కోట్లు.. UA 1.05 కోట్లు ..సీడెడ్ 1.15 కోట్లు ..గుంటూరు 54 ఎల్ .. నెల్లూరు 24 ఎల్ .. కృష్ణ 51 ఎల్.. వెస్ట్ 29 ఎల్.. తూర్పు 52 ఎల్.. వసూలైంది. 2వ రోజు మొత్తం AP/TS షేర్ : 8.4 కోట్లుగా నమోదైంది. మొత్తం 2 రోజులు కలుపుకుని AP/TS షేర్ 18.77 కోట్లకు చేరుకుందని ట్రేడ్ రిపోర్ట్ అందింది.