Begin typing your search above and press return to search.
ప్లాప్ టాక్ తో పర్వలేదనిపించిన కలెక్షన్స్.. పండుగ అడ్వాంటేజ్ అంటే ఇదేనేమో..!
By: Tupaki Desk | 15 Jan 2021 7:58 AM GMTకోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ - విజయ్ సేతుపతి కలిసి నటించిన తాజా చిత్రం ''మాస్టర్'' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో జనవరి 13న విడుదలవగా.. హిందీ వర్షన్ మాత్రం జనవరి 14న రిలీజ్ అయింది. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే మూడు గంటల నిడివి గల 'మాస్టర్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.
'మాస్టర్' చిత్రాన్ని తెలుగులో కోనేరు మహేష్ విడుదల చేశాడు. విజయ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తో కూడా తొలి రోజే 80 శాతం వసూళ్లను అందుకుందని తెలుస్తోంది. ఇక రెండో రోజు ఒకటి రెండు ఏరియాలను మినహా బాగానే వసూలు చేసిందట. రెండో రోజు సుమారు 1.62 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ప్లాప్ టాక్ తో కూడా ఈ మాదిరి కలెక్షన్స్ రావడానికి ముఖ్య కారణం ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడం మరియు పండుగ అడ్వాంటేజ్ కలిసి రావడమే అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. మరి 'క్రాక్' 'రెడ్' 'అల్లుడు అదుర్స్' సినిమాల ప్రభావాన్ని తట్టుకుని 'మాస్టర్' రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో వసూళ్ళు రాబడుతుందో చూడాలి.