Begin typing your search above and press return to search.
కలెక్షన్స్ తగ్గని క్రాక్! 50కోట్ల క్లబ్ లోకి..
By: Tupaki Desk | 22 Jan 2021 10:20 AM GMTటాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీ విడుదలై పదిరోజులు దాటినా వసూళ్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా మహమ్మారి కారణంగా వాయిదాపడి.. ఈ ఏడాది సంక్రాంతి ముందు విడుదలైంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే క్రాక్ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సంక్రాంతికి ముందే జనవరి 9న విడుదలైన క్రాక్.. ఒంగోలులో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. పవర్ ఫుల్ యాక్షన్ అంశాలతో క్రాక్ మాస్ రాజా ఫ్యాన్స్ అంచనాలను అందుకుందని చెప్పవచ్చు. విడుదలకు ముందే అన్ని ప్రమోషన్లతో ప్రేక్షకులలో ఆసక్తి పెంచేసారు మేకర్స్. అటు ఆడియో పరంగా ఇటు థియేట్రికల్ ట్రైలర్ పరంగా క్రాక్ ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. కానీ తెలుగు స్టేట్స్ థియేటర్లలో 50% సీటింగ్ మాత్రమే అనుమతి లభించడంతో ఎం వసూల్ చేస్తుందిలే అని అనుకున్నారంతా. కానీ 50% సీటింగ్ అయినా ఏదైనా క్రాక్ సినిమా మాత్రం వసూళ్లను అదే రేంజిలో రాబడుతోంది. ఫస్ట్ డే నుండి పాజిటివ్ వైబ్ తో వసూళ్లపరంగా కనకవర్షం కురిపిస్తోంది క్రాక్. అభిమానులు మార్నింగ్ నుండి నైట్ సెకండ్ షో పడేవరకు వెయిట్ చేసి సినిమాను సూపర్ హిట్ చేశారు.
మొత్తానికి అటు క్రిటిక్స్, ఇటు ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేసారు. ఆల్రెడీ సినిమా నిర్మాతను క్రాక్ సేఫ్ చేసేసిందట. అయితే ఈ సినిమా సగం సీటింగ్ లో కూడా బెస్ట్ గానే వసూల్ చేస్తోందని చెప్పవచ్చు. ఇక సంక్రాంతి సెలవులు ముగిసాయి. థియేటర్లలో కలెక్షన్స్ తగ్గడం ప్రారంభమైంది. అయితే వేరే సినిమాలన్ని కలెక్షన్స్ తగ్గినా క్రాక్ సినిమా కలెక్షన్స్ మాత్రం పెద్దగా తగ్గలేవట. క్రాక్ అనేది టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ అయిందనే చెప్పాలి. విడుదలై 10 రోజులు గడిచినా క్రాక్ కలెక్షన్స్ కోటికి తగ్గలేదని సమాచారం. 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ 94లక్షల షేర్స్ రాబట్టిందట. ఓ వైపు క్రాక్ తర్వాత విడుదలైన రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలకు కొన్ని లక్షల వరకే కలెక్షన్స్ పరిమితం అయ్యాయని తెలుస్తుంది. ఇప్పటికే క్రాక్ 28 కోట్లకు పైగా షేర్స్ వసూల్ చేసేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్రాక్ సినిమా 13రోజుల్లో 50కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికైతే ప్రాఫిట్ జోన్ లో ఉన్న క్రాక్ మరి ఈరోజు నుండి థియేటర్స్ పెంచుతున్నారు. ఎలా ఉండబోతుందో చూడాలి.