Begin typing your search above and press return to search.
RC15 .. కాలేజ్ బ్యాక్ డ్రాప్ సాంగ్ హైలైట్
By: Tupaki Desk | 5 July 2022 2:47 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో RC15 సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు రాజీ అన్నదే లేకుండా ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టుబడుల్ని సమకూరుస్తున్నారు. తాజా సమాచారం మేరకు.. ఆర్.సి 15 షూటింగ్ అమృత్ సర్ లో జరుగుతోంది.
ప్రస్తుతం కాలేజీ ఆధారిత పాటను చిత్రీకరిస్తున్నారని దాదాపు 400 మంది డ్యాన్సర్లు ఈ పాటలో పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కాలేజ్ సాంగ్ సినిమాలోని హైలైట్ లలో ఒకటిగా నిలుస్తుందని సమాచారం. సిద్ధార్థ్ బోయ్స్ లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ సాంగ్ ని మరిపించేలా ఈ పాట ఉంటుందని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య రూపొందిస్తున్న ఈ పాటలో రామ్ చరణ్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
చరణ్ ద్విపాత్రలపై లీకులు
ఆర్.సి 15లో రామ్ చరణ్ ని ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఎలా చూపించబోతున్నాడో చూడాలన్న ఉత్కంఠ అభిమానుల్లో అంతకంతకు పెరుగుతోంది. ఇందులో చరణ్ ని ఎన్ని వైవిధ్యమైన గెటప్పుల్లో శంకర్ చూపిస్తున్నారు? అంటూ మెగాభిమానుల్లో చర్చ సాగుతోంది. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
అలాగే ఈ మూవీలో చరణ్ కెరీర్ లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడని అభిమానుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ తండ్రి.. ఇద్దరు కొడుకుల పాత్రలో కనిపించనున్నాడు. ఒక కొడుకు నెగెటివ్ షేడ్ తో విలన్ గా కనిపిస్తారు.
మరొకరు సివిల్ సర్వెంట్ అవుతారు. ఇక నెగెటివ్ షేడ్ ఉన్న కొడుకు పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని ఇటీవల టాక్ వినిపించింది. నిజానికి శంకర్ ఏదైనా పాత్రను క్రియేట్ చేసారు అంటే దానికి ఒక పర్పస్ ని అంతే బలంగా ఆపాదిస్తారు. ఒక కొడుకు విలన్ గా మారేందుకు బలమైన కారణం ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే నెగెటివ్ షేడ్ పాత్ర నుంచి కావాల్సినంత నటనను పిండుకునేందుకు తనకు ఉండే ఛాయిస్ ని శంకర్ అస్సలు వదులుకోరు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ను వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు లో మూడు పాత్రల్లో అద్భుత నటనతో చిరు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్ కి చిరు మైమరిపించే ట్రీటిచ్చారు. అయితే అందుకు భిన్నమైన కథ పాత్రల్లో చరణ్ ఇప్పుడు నటిస్తున్నారనేది గుసగుస.