Begin typing your search above and press return to search.

మహేష్‌ గురించి స్వాతి ఆసక్తికర కామెంట్‌

By:  Tupaki Desk   |   20 Dec 2018 1:30 AM GMT
మహేష్‌ గురించి స్వాతి ఆసక్తికర కామెంట్‌
X
బుల్లి తెర ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన కలర్స్‌ స్వాతి ఆ తర్వాత హీరోయిన్‌ గా కూడా తెలుగు తో పాటు ఇతర భాషల్లో రాణించింది. స్వాతి ఈ మద్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె రానా టాక్‌ షో నెంబర్‌ 1 యారి విత్‌ రానాలో పాల్గొంది. హీరో నిఖిల్‌ తో కలిసి స్వాతి కలిసి పాల్గొంది. ఈ షోలో రానా వీరిద్దరి నుండి పలు ఆసక్తికర విషయాలను రాబట్టాడు. స్వాతి మరియు నిఖిల్‌ పలు విషయాల పై స్పందించారు.

స్వాతి ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌ యాటిట్యూడ్‌ నచ్చుతుందని, ఆయనలా ప్రవర్తించాలని తాను కోరుకుంటాను అంది. ఇక మహేష్‌ బాబు చాలా కామ్‌ అనుకుంటారు. కాని ఆయన తో వర్క్‌ చేసిన వారికి ఆయన గురించి తెలుస్తుంది. ఆయన చాలా చమత్కారి, పంచ్‌ లు వేయడంతో పాటు, ఇతరుల పై జోకులు వేస్తాడని చెప్పుకొచ్చింది. అంత చమత్కారి అయినా కూడా సైలెంట్‌ వ్యక్తి అంటూ ఇమేజ్‌ ను సొంతం చేసుకోవడం చాలా గొప్ప విషయం అంది. అలాంటి క్వాలిటీని నేను మహేష్‌ నుండి తీసుకోవాలనుకుంటాను, ఇక ఎన్టీఆర్‌ నుండి ట్యాలెంట్‌, ప్రభాస్‌ నుండి హైట్‌, రానా నుండి లవ్వింగ్‌ నేచర్‌ ను తీసుకుంటానని చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్‌ అందరి గురించి కూడా బయట ఒక బ్యాడ్‌ టాక్‌ ఉంది. హీరోయిన్స్‌ అందరిది కూడా లూజ్ క్యారెక్టర్‌ అని, హీరోయిన్స్‌ ఇండస్ట్రీలో ఎవరితో పడితే వారితో పడుకుంటారు అనే టాక్‌ ఉంది. ఆ విషయం నాకు చాలా బాధ కలిగించే విషయం. స్వాతి మాత్రమే కాకుండా నిఖిల్‌ కూడా పలు విషయాల పై తనదైన శైలిలో మాట్లాడి తన వ్యక్తిత్వంను చూపించాడు.