Begin typing your search above and press return to search.

'కలర్ ఫొటో' హీరో కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌

By:  Tupaki Desk   |   29 Dec 2022 7:12 AM GMT
కలర్ ఫొటో హీరో కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌
X
సుహాస్‌ హీరోగా కలర్‌ ఫొటోతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో సుహాస్‌ స్థాయి మరింతగా పెరిగి పలు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే హిట్ 2 సినిమా లో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే.

ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో సుహాస్ తదుపరి సినిమా విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైటర్ పద్మభూషణ్‌ అనే సినిమా తో సుహాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను లహరి ఫిల్మ్స్‌ మరియు ఛాయ్‌ బిస్కట్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమాను ఫిబ్రవరి 3వ తారీకు రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో సుహాస్‌ మరో మంచి పాత్రలో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. రిలీజ్ పోస్టర్‌ చాలా కూల్‌ అండ్‌ పాజిటివ్‌ గా ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని ఇప్పటికే పాజిటివ్‌ బజ్ ను మేకర్స్ క్రియేట్‌ చేయగలిగారు.

రచయితగా బతుకు పోరాటం చేసే ఒక వ్యక్తి యొక్క జీవితం ను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమా లో టీనా శిల్పరాజ్‌ హీరోయిన్‌ గా నటించింది. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించాడు.

శేఖర్ చంద్ర మరియు కళ్యాణ్‌ నాయక్ లు ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాట వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా ట్రైలర్‌ ను జనవరిలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. సినిమా ను పెద్దగా పోటీ లేని ఫిబ్రవరి 3న విడుదల చేయడం కలిసి వచ్చే అంశం. సుహాస్ మరోసారి మ్యాజిక్ చేస్తాడా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.