Begin typing your search above and press return to search.

ఇదీ టాలీవుడ్ అసలు కలర్

By:  Tupaki Desk   |   13 April 2017 5:29 AM GMT
ఇదీ టాలీవుడ్ అసలు కలర్
X
రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన బ్లాక్ కామెంట్స్.. సౌత్ లో దుమారం రేపడంలో ఆశ్చర్యమేమీ లేదు. వివాదాలపై అంతగా స్పందించని పవన్ లాంటి వ్యక్తి కూడా ఈ టాపిక్ పై మాట్లాడాడంటే.. దక్షిణాది ప్రజల రంగును ఇన్సల్ట్ చేయడం ఎంతగా హర్ట్ చేసిందో అర్ధమవుతుంది.

అయితే.. సినిమా ఫీల్డ్ లో ఈ రంగుకు బోలెడంత ప్రాధాన్యం ఉంటుందని సినిమా జనాలే అంటున్నారు. కానీ ఇది కేవలం హీరోయిన్లకు మాత్రమే వర్తిస్తుంది. హీరోల్లో చాలామంది చామనచాయగా ఉన్నవారే ఉంటారు. రంగు బాగా డార్క్ గా ఉన్నా సరే హీరోలుగా చెలామణీ కావచ్చు. అయితే.. హీరోయిన్ల విషయంలో మాత్రం తెల్లగానే ఉండాలనే ఎక్కడా రాయకపోయినా ఫాలో అయిపోయే రూల్. 'తెల్లగా ఉంటేనే హీరోయిన్లను యాక్సెప్ట్ చేస్తారు. మగవారి గురించి మాట్లాడితే.. టాల్.. డార్క్.. హ్యాండ్సమ్ అంటారు కానీ అమ్మాయిల విషయంలో మాత్రం మొదటగా రంగునే చూస్తారు' అంటున్నారు సీనియర్ నటి జీవిత.

'టాలీవుడ్ లో ఈ విషయంలో కొన్ని సడలింపులు ఉన్నాయి. కొన్ని పెద్ద మసాలా చిత్రాలకు వచ్చేసరికి కొన్ని రూల్స్ ఉంటాయి. హీరోయిన్ నటించకపోయినా పర్లేదు కానీ.. తెల్లగానే ఉండాలి. బాగా డ్యాన్స్ చేయాలి. అలాగే హీరో కంటే ఎక్కువగా నటించేయకూడదు. అలా చేస్తే హీరోను డామినేట్ చేస్తుంది కదా' అంటున్నాడు దర్శకుడు తేజ.

అలనాటి హీరోయిన్లలో ఒక్క జయప్రద మినహాయిస్తే ఎవరికీ ఫెయిర్ స్కిన్ ఉండేది కాదని చెబుతున్నారు నిర్మాత సురేష్ బాబు. వాణిశ్రీ రంగు ఎలా ఉన్నా జనాలు పట్టించుకోలేదని.. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారనే సంగతి గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే త్రిష మాత్రమే డస్కీ బ్యూటీ అయినా స్టార్ స్టేటస్ అందుకోగలిగింది. మిగిలినవారంతా ఫెయిర్ స్కిన్ తోనే నెట్టుకొస్తున్నారు. మరి కలర్ విషయంలో ఇన్ని పట్టింపులు ఇండస్ట్రీ జనాల్లో ఉండొచ్చా అన్నది పాయింట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/