Begin typing your search above and press return to search.
వీడియో సాంగ్: 'రంగ్ దే' నుంచి కలర్ ఫుల్ 'రంగులే రంగులే'
By: Tupaki Desk | 24 March 2021 11:49 AM GMTయువ హీరో నితిన్ - కీర్తి సురేశ్ జంటగా నటించిన ''రంగ్ దే'' సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా నుంచి 'రంగులే' అనే మరో గీతాన్ని విడుదల చేశారు. ఇప్పటికే ఈ మ్యాజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజికల్ ఆల్బమ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో వచ్చిన 'రంగులే రంగులే..' వీడియో సాంగ్ కూడా సంగీత ప్రియులను అలరోస్తోంది.
'నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగెనే.. అవి నిన్ను చూసినప్పుడే.. నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే.. నువ్వు నన్ను చూసినప్పుడే' అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ మంచి ట్యూన్ సమకూర్చాడు. 'రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే' అంటూ ఓ అమ్మాయి తన మనసులోని ప్రేమను రంగులతో తెలియజెప్పే విధంగా లిరిసిస్ట్ శ్రీమణి అర్థవంతమైన సాహిత్యం అందించారు. ఈ పాటను సింగర్ శ్వేత మోహన్ ఆలపించారు.
లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ అందించిన అందమైన విజువల్స్ తో ఈ వీడియో సాంగ్ కలర్ ఫుల్ గా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్ - కీర్తి వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ఇటీవలే బెస్ట్ ఎడిటర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సినిమాని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.