Begin typing your search above and press return to search.
సినిమా రివ్యూ: కొలంబస్
By: Tupaki Desk | 23 Oct 2015 10:31 AM GMTచిత్రం : ‘కొలంబస్’
నటీనటులు- సుమంత్ అశ్విన్ - సీరత్ కపూర్ - మిస్త్రి చక్రవర్తి - రోహిణి - పృథ్వీ - సప్తగిరి తదితరులు
సంగీతం- జితిన్ రోషన్
ఛాయాగ్రహణం-భాస్కర్ సామల
సంగీతం- జితిన్ రోషన్
కథ - స్క్రీన్ ప్లే- ఎమ్మెస్ రాజు
నిర్మాత - అశ్వని కుమార్ సహదేవ్
మాటలు - దర్శకత్వం- ఆర్.సామల
విజయదశమికి ముందొచ్చిన రెండు పెద్ద సినిమాలు ఇంకా థియేటర్లలో ఉన్నాయి. ఇక పండుగ రోజు ‘కంచె’, ‘రాజు గారి గది’ వరుసలో నిలిచాయి. ఇంత పోటీ ఉన్నా ‘కొలంబస్’ కాన్ఫిడెంటుగా రేసులోకి వచ్చేసింది. మరి ఆ సినిమా అంత విశేషం ఏముందో చూద్దాం పదండి.
కథ:
అశ్విన్ (సుమంత్ అశ్విన్) ప్రేమ కోసం జైలుకెళ్లిన కుర్రాడు. రెండేళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటికి వస్తే అతడి ప్రేయసి ఇందు (మిస్త్రి చక్రవర్తి) కనిపించదు. వెతికి వెతికి చివరికి ఇందు ఎక్కడుందో కనుక్కుంటాడు. ఐతే ఇందును నేరుగా కలవలేక తను పని చేసే కంపెనీకే చెందిన నీరజ (సీరత్ కపూర్) సాయం తీసుకుంటాడు. ఐతే ఇందు.. మరొకరికి దగ్గరవుతుండటం చూసి నీరజ సాయంతో ఆ మరో వ్యక్తిని ఆమెకు దూరం చేసే ప్రయత్నం చేస్తాడు అశ్విన్. ఇంతకీ అశ్విన్, ఇందు ఎందుకు దూరమయ్యారు? అశ్విన్ జైలుకెందుకు వెళ్లాడు? చివరికి అతను ఇందుకు మళ్లీ చేరువయ్యాడా? లేదా అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
ఎమ్మెస్ రాజు నిర్మాతే కాదు.. దర్శకుడు - రచయిత కూడా. ఒకప్పుడు వర్షం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రాసిన ప్రతిభాశాలి ఎమ్మెస్ రాజు. తాజాగా ‘కొలంబస్’ సినిమాకు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించారు. ఆయన ఫామ్ కోల్పోయారని ‘తూనీగ తూనీగ’తోనే తేలిపోయింది. ఐతే ఇంకోసారి ‘కొలంబస్’ సినిమాతో ఆ విషయాన్ని రుజువు చేశారు.
అమెరికాను కనిపెట్టిన కొలంబస్ పేరు పెట్టారు కాబట్టి ఇక్కడ హీరో ఇంకోదో కనిపెట్టేస్తాడని... ఇదేదో గొప్ప కథ అయి ఉంటుందని.. అని ఆశిస్తే నిరాశ తప్పదు. ఈ కొలంబస్ తనకు చెప్పకుండా అడ్రెస్ మార్చేసిన ప్రేయసి కోసం వెతుకుతాడంతే. ఆ అడ్రస్ కూడా చాలా సింపుల్ గా దొరికేస్తుంది. ఆ తర్వాత సిల్లీ ప్లానులేసి హీరోయిన్ కు దగ్గరైపోతాడు.
హీరో ప్రేమ కోసం జైలుకెళ్లడం.. అక్కడి నుంచే డిగ్రీ పూర్తిచేయడం.. ఈ విశేషాలు సినిమా మీద కొంచెం ఆసక్తి రేపాయి. ఐతే కానీ ఆ జైలుకు సంబంధించిన విషయాల్లో ఏం విషయం లేదు. హీరో ఇంట్రడక్షన్ సీన్ ఒక్కటి ఆ జైల్లో తీశారు. ఆ వెంటనే హీరో రిలీజై బయటికొచ్చేసి హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెడతాడు. జైల్లో హీరోయిన్ పేరు తలుచుకుని అవతలి కబడ్డీ జట్టునంతా ఔట్ చేసేసి.. జైలు నుంచి డిస్టింక్షన్లో ఇంజినీరింగ్ కూడా పాసైపోయాడంటే.. అతడికేదో డీప్ లవ్ స్టోరీ ఉంటుందని అనుకుంటాం కానీ.. ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఈ మాత్రం లవ్ స్టోరీకా హీరో అంతగా ఫీలైపోయాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో విషయం లేకపోయినా.. ద్వితీయార్ధంలో తన ప్రేయసిని తిరిగి లైన్ లో పెట్టడానికి రెండో హీరోయిన్ సాయంతో హీరో వేసే ప్లాన్లు కొంచెం ఆసక్తి కలిగిస్తాయి. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్.. ద్వితీయార్ధంలో హీరోయిన్ కొత్త బాయ్ ఫ్రెండుని ఇరికించడానికి హీరో, రెండో హీరోయిన్ కలిసి ప్లాన్ చేసే సన్నివేశాలకు సంబంధించి స్క్రీన్ ప్లే పర్వాలేదు. ఈ ప్లాన్ లవీ సిల్లీగా, ప్రెడిక్టబుల్ గానే ఉన్నప్పటికీ ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం చాలా బెటర్ అనిపించేలా చేస్తాయి.
ఐతే క్లైమాక్స్ లో ఏం జరగబోతోందని చాలా ముందే ప్రేక్షకుడికి హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. దీంతో చివర్లో వచ్చే మలుపు అంతగా ఆకట్టుకోదు. పైగా హీరో ఓ అమ్మాయిని లైన్లో పెట్టబోతూ.. ఇంకో అమ్మాయితో స్నేహం చేయడం.. చివరికి అసలు హీరోయిన్ లైన్ లోకి వచ్చాక.. ఇంకో హీరోయిన్ తో ప్రేమలో పడిపోవడం.. చివరికి ఎవర్ని ఎంచుకోవాలో తేల్చుకోలేకపోవడం.. ఇలాంటి కథలు ఇంతకుముందే తెలుగులో కొన్ని వచ్చాయి.
లవ్ స్టోరీలకు ‘ఫీల్’ అన్నది అన్నిటికంటే ముఖ్యం. ‘కొలంబస్’ ఆ ఫీల్ తేవడంలో సక్సెస్ కాలేదు. ఉండటానికి రెండు లవ్ స్టోరీలున్నాయి కానీ.. ఏదీ కూడా జనాలకు అంతగా కనెక్టవలేదు. ఉన్నంతలో హీరో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మెయిన్ లవ్ స్టోరీతో పోలిస్తే.. వర్తమానంలో రెండో హీరోయిన్ తో లవ్ స్టోరీనే కాస్త నయం. సప్తగిరితో కామెడీ చేయించే ప్రయత్నం చేశారు కానీ.. అతడి కంటే హీరో-రెండో హీరోయిన్ మధ్య వచ్చే ఫన్నీ సీన్సే కొంచెం బెటర్. కథకుడు - దర్శకుడు హైలైట్ అని భావించిన సన్నివేశాలు పెద్దగా పని చేయలేదు. ఓ సాదాసీదా లవ్ స్టోరీ చూసిన ఫీలింగుతోనే బయటికొస్తాడు ప్రేక్షకుడు. ప్రధాన పాత్రల క్యారెక్టరైజేషన్స్ అన్నీ మామూలుగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ అయింది.
నటీనటులు:
సుమంత్ అశ్విన్ మంచి నటుడన్న సంగతి ఇంతకుముందే ప్రూవ్ అయింది. ఐతే మంచి కథ పడ్డపుడే అతను రాణిస్తాడు. ‘అంతకుముందు ఆ తరువాత’ లాంటి సినిమాలు పడితే అతను తన ప్రతిభ చూపిస్తాడు. కానీ ‘కొలంబస్’ అతడికి పెద్ద ఛాలెంజేమీ విసరలేదు. తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో సుమంత్ తన ప్రయత్నం తాను చేశాడు కానీ.. అతడి పాత్ర పేలవంగా ఉండటంతో సుమంత్ జనాలకు అతణ్ని ఈ సినిమాతో గుర్తుంచుకునే అవకాశం లేకపోయింది. మిస్త్రి చక్రవర్తి పాత్ర కూడా అంతే. ఆమె లీడ్ హీరోయిన్ అన్న ఫీలింగ్ ఏ కోశాన కలగదు. క్యారెక్టరుకి తగ్గట్లే ఆమె నటన కూడా ఉంది. ఉన్నంతలో సీరత్ కపూర్ బెటర్. ఆమె క్యారెక్టర్ కి కొంచెం వెయిట్ ఉంది. ఆమె కాస్త నటించింది కూడా. కానీ గ్లామర్ విషయంలో సీరత్ కు మైనస్ మార్కులు పడతాయి. విలన్ గా నటించిన కుర్రాడు పర్వాలేదు. రోహిణికి పెద్దగా నటించే అవకాశం దక్కలేదు. సప్తగిరి ఖాతాలో మరో చెత్త క్యారెక్టర్ పడింది. అతను ఏమాత్రం నవ్వించలేకపోయాడు.
సాంకేతిక వర్గం:
జితిన్ రోషన్ పాటలు - నేపథ్య సంగీతం పర్వాలేదు. రెండు పాటలు బావున్నాయి. భాస్కర్ సామల ఛాయాగ్రహణం కూడా ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు ఆర్.సామల ఈ సినిమాకు మాటల రచయిత కూడా. అక్కడక్కడా కొన్ని పంచ్ లు పేలాయి. దర్శకుడు కొత్త వాడైనా కొన్ని సన్నివేశాల్లో పనితనం చూపించాడు. ఐతే ప్రథమార్ధంలో అతడి అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. తొలి గంట సినిమా చూస్తే దర్శకుడి పనితనం మీద చాలా సందేహాలు కలుగుతాయి కానీ.. ద్వితీయార్ధంలో పర్వాలేదనిపించాడు. ఎమ్మెస్ రాజు కథాకథనాల్లోనే లోపాలున్నాయి కాబట్టి.. నింద దర్శకుడి మీదే వేసేయలేం.
చివరగా: కొలంబస్.. బోరింగ్ లవ్ డిస్కవరీ
రేటింగ్- 2/5
#Columbus, #Columbusmovie, #ColumbusTalk, #ColumbusRating, #ColumbusReview, #ColumbusMovieReview, #SumanthAshwinColumbus
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre