Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలి
By: Tupaki Desk | 31 July 2021 1:30 PM GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్నందువల్ల ఆయన నుండి వెంటనే సినిమాను ప్రేక్షకులు ఆశించారు. ఎన్టీఆర్ తో ఆయన వెంటనే సినిమాను ప్రకటించినా కరోనా వల్ల అది కాస్త ఆలస్యం అయ్యింది. ఏదో కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఖలేజా తర్వాత ఎప్పుడెప్పుడు వీరి కాంబోలో సినిమా వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ అధికారిక ప్రటకన వచ్చిన నేపథ్యంలో ఇక షూటింగ్ మొదలు అవ్వడమే తరువాయి అంటూ అంతా అనుకుంటూ ఉన్నారు. కాని ఇప్పటి వరకు షూటింగ్ కు వెళ్లక పోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు త్రివిక్రమ్ టీమ్ నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ డైలాగ్ వర్షన్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు. ఎప్పుడు మహేష్ బాబు ఓకే చెప్తే అప్పుడు వెంటనే షూటింగ్ కు వెళ్లి పోవడమే అంటూ సిద్దంగా ఉన్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన తర్వాత కంటిన్యూస్ గా షూటింగ్ ఉంటుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మహేష్ బాబు 75 రోజుల డేట్లను ఇవ్వబోతున్నాడట. 75 రోజుల వర్కింగ్ డేస్ లో ముగించబోతున్నారు. అంటే సినిమా కాస్త అటు ఇటుగా నాలుగు నెలల్లోనే పూర్తి చేయబోతున్నారు.
అక్టోబర్ లో సినిమా పట్టాలు ఎక్కినా కూడా జనవరి వరకు షూటింగ్ ను ముగించబోతున్నారు. కాస్త ఆలస్యం అయితే ఫ్రిబవరిలో సినిమాకు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక సినిమా ను పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ లేదా మే లో సమ్మర్ కానుకగా విడుదల చేయడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో త్రివిక్రమ్ ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ద కనబర్చుతున్నారు. డైలాగ్ వర్షన్ ను చూసిన వారు అద్బుతంగా వచ్చిందని.. మరోసారి అతడు రేంజ్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు అతడకు సంబంధం ఉంటుందని.. నందు పూరిల తనయుడు పార్థు కథతో ఈ సినిమా ఉంటుందని.. సినిమా కు అతడే పార్థు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కథ గురించి ఎలాంటి అప్ డేట్ ను ఇవ్వలేదు.
కనుక మీడియాలో ప్రస్తుతం వస్తున్న వార్తలన్ని పుకార్లే అయ్యి ఉంటాయి. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో కథల గురించి వస్తున్న వార్తలన్ని కూడా పుకార్లుగానే ప్రస్తుతానికి భావించాలి. త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించి షూటింగ్ జరుపుతున్న సమయంలో కాస్త కాస్తగా కథ గురించి రివీల్ అవుతుందని ఆశిద్దం.
మొత్తానికి మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబో మూవీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా షూటింగ్ ను త్వరగా ప్రారంభించాలనే కోరుకుంటున్నారు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ కు ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా ఆ సినిమాను దర్శకుడు చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో మహేష్ బాబు లుక్ కొత్తగా ఉంటుందని ఇప్పటికే తేలిపోయింది. నేడు వచ్చిన మహేష్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.