Begin typing your search above and press return to search.
కన్ఫ్యూజన్ లో జబర్దస్త్ జడ్జ్ కహాని
By: Tupaki Desk | 23 May 2019 4:35 AM GMTతెలుగు కామెడీ షోలలో గత కొన్నేళ్ళుగా నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా సాగుతున్న జబర్దస్త్ కు జడ్జ్ ల పితలాటకం వచ్చి పడింది. అమలాపురం ఎంపి క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న కారణంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు కొంత కాలంగా దీనికి దూరంగా ఉన్నారు. గెలిచినా ఓడినా తాను షోకు మళ్ళి తిరిగి వస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జరుగుతున్న పరిణామాలు అంత అనుకూలంగా అయితే లేవు.
ప్రస్తుతానికి రోజా తిరిగి వచ్చారు. మీనా కొన్ని ఎపిసోడ్స్ చేసినా మాస్ గా సాగే ఈ షోకు ఆమె సాఫ్ట్ లుక్ అంతగా నప్పలేదన్న కారణంగానో లేక పారితోషికం విషయంలో వచ్చిన విభేదాల వల్లనో తెలియదు కాని ఆవిడా తప్పుకుంది. సంఘవిని తీసుకొచ్చారు. జానీ మాస్టర్ టైట్ షెడ్యూల్ వల్ల అతనూ ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు
తాజా అప్ డేట్ ప్రకారం కమెడియన్ ఆలిని జబర్దస్త్ జడ్జ్ గా సెట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు టాక్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాని షూట్ కూడా జరుగుతోందట. అంటే నాగబాబు గెలుస్తాడని నమ్మకమో లేక జనసేనలో నెంబర్ టూగా ఉన్న తను ఇలాంటివి చేస్తే బాగుండదన్న భావనో తెలియదు కాని నాగబాబు వెంటనే వచ్చే పరిస్థితి లేదన్నది మాత్రం స్పష్టం.
ఆలి ఇప్పటికే సెలబ్రిటీ ఇంటర్వ్యూల ద్వారా అదే ఛానల్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. పైగా ఊరికే జోకులు చూస్తూ కూర్చుకుని నవ్వే పని కాబట్టి ఆలి చేసే రిస్క్ ఏముండదు. జనసేనతో విభేదం తెచ్చుకున్న ఆలి నాగబాబు స్థానాన్ని ఎంతవరకు భర్తీ చేస్తాడనేది వేచి చూడాలి. ప్రోమోలు వచ్చాక నిజంగా ఆలి ఉన్నాడా లేదా అనే క్లారిటీ వస్తుంది