Begin typing your search above and press return to search.
యాక్టరే కాదు.. మంచి డాక్టర్ కూడా
By: Tupaki Desk | 22 Oct 2017 1:30 AM GMTనవ్వండి - నవ్వించండి... నవ్వు ఆరోగ్యకరం అని అహ నా పెళ్ళంట సినిమా ద్వారా జంధ్యాల గారు మనకు మంచి సందేశాన్ని ఇచ్చారనే చెప్పాలి. నవ్వడం ఒక భోగాం.. నవ్వకపోవడం ఒక రోగం అని పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు. ఈ రోజుల్లో మనల్ని చాలా మంది కమెడియన్లు వారి నటనతో నవ్విస్తున్నారు. అల్లు రామలింగయ్య దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు అనేకమంది కమెడియన్స్ టాలీవుడ్ లో పుట్టుకొచ్చారు. ప్రస్తుతం యువ కమెడియన్లు కూడా మంచి టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో భద్రం కూడా ఒకడు.
రీసెంట్ గా వచ్చిన మహానుభావుడు సినిమాలో నాజర్ పక్కన తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో జిడ్డేశ్ పాత్రలో అందరిని నవ్వించాడు. ముఖ్యంగా 'అల్లుడు గారు మామూలుగా లేరండీ..’ - ‘అల్లుడు గారికి సరసం బాగా ఎక్కువండీ బాబూ..’ అనే డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. ఇతన్ని చూస్తే ఎవ్వరైనా ఎంత కష్టపడి నటుడు అయ్యాడో.. ఫిల్మ్ నగర్ లో ఎన్ని బాధలు పడ్డాడో అనుకుంటారు. కానీ మనోడి జాబ్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. హైదరాబాద్ లో ఎర్గొనోమిక్స్ డాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వృత్తిపరంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలకు ఫీజియోథెరపీ చేసేవాడు. అదికూడా బెంగుళూరులో అభ్యసించి వచ్చాడు. నిజంగా అతని బాష - నటన తీరును చూస్తే నమ్మబుద్ది కాదు కదా ఇది నిజం. నవ్వించేవాడిని డాక్టర్ తో పోలుస్తారు. భద్రం డాక్టర్ గా జీవితాన్ని ఆరంభించి యాక్టర్ గా జీవితాన్ని కొనసాగించడం దేవుడిచ్చిన వరమని అంటున్నాడు.
ఈ భద్రం గురించి ఇంకా చెప్పాలంటే.. మొదట స్నేహితుని సలహాతో మనోడు లవ్ పెయిన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మంచి గుర్తింపు పొందాడు, ఆ తర్వాత సన్నిహితుల సహాయంతో మ్యాంగో కంపెనీకి బాగా దగ్గరయ్యాడు. అక్కడ పెళ్లితో జరభద్రం అనే మరో షార్ట్ ఫిల్మ్ ను తీసి ఈ స్థాయి ప్రముఖ దర్శకుల దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఆ షార్ట్ ఫిల్మ్ ను చూసి. ఇలాంటి నటులే ఇండస్ట్రీకి కావాలని ఆయన కలవమని చెప్పడంతో మొదటి సారి ఆయన సినిమాలో అవకాశం దక్కింది. జ్యోతిలక్ష్మి సినిమాలో బ్రోకర్ భద్రం గా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత కూడా మారుతీ గారు బలే బలే మగాడివోయ్ సినిమాలో అవకాశం ఇవ్వగా ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కాయి. శతమానం భవతి - లోఫర్ - మొన్నటి మహానుభావుడు వంటి సినిమాల్లోని పాత్రలు చాలా బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటివరకు భద్రం దాదాపు 50 సినిమాల్లో నటించాడు.