Begin typing your search above and press return to search.

కూర్చుంటే పోతారు అంటున్న భద్రం!

By:  Tupaki Desk   |   31 May 2019 9:35 AM GMT
కూర్చుంటే పోతారు అంటున్న భద్రం!
X
తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్న ఈ జనరేషన్ కమెడియన్స్ లో భద్రం ఒకరు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టిన భద్రం తొలిసారిగా 'H2' అనే వెబ్ సీరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో భద్రం ఒక డాక్టర్ గా కనిపిస్తారు. మనకు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు చెప్తారు.

జాగ్రత్తలు అనగానే "ఆయన పేరు ముఖేష్. ఆయన తిత్తిని తొలగించారు" అంటూ డ్రాక్యులా సినిమాలో లాగా ఒక భయంకరమైన సీన్ చూపిస్తూ మన సినిమాల్లో టైటిల్స్ కు ముందు అందించే హెల్త్ వార్నింగ్స్ కాదు బాబాయ్.. కాదు. ఆ హెల్త్ టిప్స్ తో పొగాకు మానే సంగతి దేవుడెరుగు. ఆరోగ్యంగా ఉన్న సాధారణ మనిషికి కూడా బీపీ.. హార్ట్ స్ట్రోక్ రావడం ఖాయం. సినిమాల టైటిల్స్ కు ముందు వచ్చేది H2 నేకానీ అది హెల్త్ + హారర్. మన భద్రం వెబ్ సీరీస్ అలా కాదు. H2.. హెల్త్ + హ్యూమర్.

ఈ వెబ్ సీరీస్ లో భాగంగా మొదటి ఎపిసోడ్ మన ముందుకు వచ్చింది. డాక్టర్ భద్రంగారు హెల్త్ టిప్ ను మసాలా లేకుండా చప్పగా వివరిస్తూ ఉంటారు. అయితే ఇంకో మాస్ భద్రం పక్కనే కూర్చుని 'ఇడమరిచి' మనందరికీ అర్థమయ్యే సింపుల్ గా ఉండే హ్యూమర్ తో చెప్తారు. మొదటి ఎపిసోడ్ లో భద్రంగారు ఎంచుకున్న అంశం 'కూర్చుంటే పోతారు'. ఇంతకంటే ఎక్కువగా చెప్తే ఆ సస్పెన్స్ పోతుంది కాబట్టి మీరే ఒక లుక్ వేయండి.. వీలైతే హాయిగా నవ్వండి. గుర్తుందిగా.. ఇది హెల్త్ ప్లస్ హరర్ కాదు. కళ్ళు మూసుకోవాల్సిన పనే లేదు. ఆ ముకేష్ కాదు. ఇక్కడ ఉండేది మన భద్రం.. మనందరి ప్రియమైన భద్రం.. మీ అందరి ఆరోగ్యం కూడా ఇకపై భద్రం!