Begin typing your search above and press return to search.

H2 కు మీరు రెడీ గా ఉన్నారా.. లేదా?

By:  Tupaki Desk   |   12 Feb 2019 6:24 PM GMT
H2 కు మీరు రెడీ గా ఉన్నారా.. లేదా?
X
ఏదైనా ఒక సినిమాకానివ్వండి.. లేదా టీవీ షో కానివ్వ్వండి లేదా వెబ్ సీరీస్ కానివ్వండి.. అందులో అందరినీ మొదటగా ఆకర్షించే అంశం టైటిల్. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఆకర్షణీయమైన.. క్యాచీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు ఒక వెబ్ సీరీస్ రాబోతోంది. ఈ కార్యక్రమం పేరే H2. రైమింగ్ ఉంది కదా అని మీరు పుసుక్కున F2 అనుకుంటారేమో కాదు మహాప్రభో కాదు. అది వేరు..ఇది వేరు.. ఈ టైటిల్ H2.

ఈ వెబ్ సీరీస్ కు వ్యాఖ్యాత ఎవరనుకున్నారు? తెలుగు ప్రేక్షకులను ఈమధ్య కాలంలో తెగనవ్విస్తున్న.. నవ్వించడానికి తెగ ప్రయత్నిస్తున్న కమెడియన్ భద్రం. ఆయన పేరులోనే భద్రం ఉంది కాబట్టి ఆయన ఆరోగ్యం ఎప్పుడూ భద్రంగానే ఉంది. అందుకే ఊరికే టైపు కొట్టుకుంటూ..క్లిక్కులు కొట్టుకుంటూ.. స్క్రీన్ ని సన్నీని చూసినట్టు కళ్ళార్పకుండా చూస్తూ ఫ్రస్ట్రేట్ అయ్యే జనాలకు కాస్త హెల్త్.. మరి కాస్త హ్యూమర్ అందించడానికి ఆయన రెడీ అవుతున్నారు.

ఈ కార్యక్రమం ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. భద్రం రియల్ లైఫ్ లో ఒక డాక్టర్ అనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆయన ప్రోమో ఇంట్రో లోనే ఆ విషయం నొక్కి చెప్పారు. మీరు మళ్ళీ అది కూడా జోక్ అనుకుంటారేమో. ఆయనకు కోపం వస్తుంది.. జాగ్రత్త. ఇక ఇంట్రోలో "నేను ఒక ఎర్గోనమిస్ట్.. కార్పోరేట్ ట్రైనర్..పర్సనల్ యోగా అండ్ స్ట్రెస్ థెరపిస్ట్.. నేను వర్క్ ప్లేస్ ఎర్గోనమిక్స్(అడ్డదిడ్డంగా కూర్చోకుండా కుదురుగా కూర్చునేందుకు దాంతో ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ అయ్యే సబ్జెక్ట్).. లాఫ్టర్".. ఇలా చాలా చాలా చెప్పారు గురువుగారు. ఇక మీరు ఒక లుక్కేసి ప్రోమో చూడండి. మళ్ళీ వాట్సాప్ మెసేజి టైప్ చేస్తూనో మరోటి చేస్తూనో కాకుండా శ్రద్ధగా చూడండి.. మీలాంటి ఘనుల వాలకం ఆయనకు బాగా తెలిసినట్టుంది.. అందుకే ఈ విషయం కూడా ప్రోమోలో చెప్పాడు. పేరు గుర్తుందిగా H2..కొంచెం హెల్త్.. కొంచెం హ్యూమర్.. వాచ్ ఇట్ గైస్..!