Begin typing your search above and press return to search.

నవ్వుల తాతయ్యతో బుల్లి మనవడు

By:  Tupaki Desk   |   15 Aug 2017 5:00 PM GMT
నవ్వుల తాతయ్యతో బుల్లి మనవడు
X
నవ్వుల పితామహుడిగా ఆధునిక టాలీవుడ్ ను ఏలేసిన ఘనుడు బ్రహ్మానందం. ఆయన కనిపిస్తే చాలా నవ్వు ఆపుకోలేం. ఒక్క ఎక్సప్రెషన్ ఇస్తే చాలు.. తట్టుకోలేం. పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వేస్తాం. అటువంటి బ్రహ్మి ఇప్పుడు తన బుల్లి మనవడితో ఆడుకుంటుంటే.. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంది తెలుసా!!

అక్కడ చూడండి.. తన నాలుగు నెలల మనవడు పార్ధ తో బ్రహ్మీ ఎలా ఆడుకుంటున్నాడో. హీరోగా ప్రయత్నాలు చేసిన కాస్త స్లో అయిన బ్రహ్మానందం పెద్దకొడుకు గౌతమ్ మనకు పరిచయమే. ఆ మధ్యన జోత్స్న అనే అమ్మాయిని ఈ కుర్రాడు వివాహమాడాడు. వీరి సంతానమే పార్ధ. ఈ బుల్లోడి రాకతో బ్రహ్మీ కుటుంబంలో చాలా ఆనందాలు అలుముకున్నాయి.

ఇకపోతే ఈ మధ్యన కొత్త కొత్త కమెడియన్ల రాకతో బ్రహ్మానందం జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఆయన మాత్రం రేపు ''ఆచారి అమెరికా యాత్ర'' సినిమాలో ఆయన మరోసారి అదుర్శ్‌ సినిమా తరహా పాత్రను చేస్తూ.. ఆ సినిమాతో తిరిగి ఫుల్ బిజి అయిపోతాను చూడండి అంటున్నాడు.