Begin typing your search above and press return to search.

హాస్య న‌టుడి ఇంటిపై మ‌రో న‌టుడి దాడి!

By:  Tupaki Desk   |   21 Jun 2017 8:46 AM GMT
హాస్య న‌టుడి ఇంటిపై మ‌రో న‌టుడి దాడి!
X
తెలుగు హాస్య‌న‌టుడు డీవీ నాయుడి ఇంటిపై దాడి జ‌రిగింది. ఈ దాడి చేసింది మ‌రెవ‌రో కాదు.. మ‌రో తెలుగు న‌టుడే కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. రానా ద‌గ్గుపాటి న‌టిస్తున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో విల‌న్ పాత్ర పోషిస్తున్న రాము.. తాజా దాడికి పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

త‌న ఇంటికి రాము త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చి దాడి చేశాడ‌ని.. త‌న ఇంట్లో ఉన్న మ‌హిళ‌పై అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లుగా బాధితుడు డీవీ నాయుడు పేర్కొన్నాడు. ఈ ఉదంతం గురించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో డీవీ నాయుడు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలే వీరి మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణంగా భావిస్తున్నారు. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు.. కేసు న‌మోదు చేసి.. విచార‌ణ చేస్తున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/