Begin typing your search above and press return to search.
మోహన్ లాల్ పై ఫైరైన హాస్యనటుడు
By: Tupaki Desk | 14 May 2016 9:56 AM GMTమాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై హాస్యనటుడు ఫైరయ్యాడంటే.. అదేదో ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘జనతాగ్యారేజ్’ షూటింగ్ స్పాట్లో అనుకుంటే పొరబడినట్టే. ఆయనపై హాస్యనటుడు కన్నెర్ర జేసింది ఎక్కడంటే.. తనకు వ్యతిరేఖంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఆ హాస్యనటుడు మోహన్ లాల్ పై ఫైరైయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాం జిల్లా పరిధిలోని పథానపురం నియోజక వర్గంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఎల్డీఎఫ్ అభ్యర్ది .. నటుడు గణేష్ కుమార్ తరఫున మోహన్ లాల్ ప్రచారం చేశారు. అయితే ఇదే నియోజక వర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీలో వున్న మాలీవుడ్ హాస్యనటుడు జగదీష్ కు ఇది నచ్చలేదు. పెద్దమనిషిలా వుండాల్సిన మోహన్ లాల్ తనకు వ్యతిరేఖంగా ప్రచారం చేయడం జీర్ణించుకోలేకపోయాడు జగదీష్. దాంతో మీడియా ముందుకొచ్చి కంటతడి పెట్టాడు. ఎన్నికల్లో మిగతా నటులు ఎలాంటి ప్రచారం చేయరాదని మాలీవుడ్ మూవీ అసోసియేషన్ తీర్మానించినా.. వాటిని ఖాతరు చేయకుండా మోహన్ లాల్ ప్రచారం చేశారంటూ.. మీడియా ముందుకొచ్చి తన బాధను వెల్లగక్కాడు.
అయితే మోహన్ లాల్ ఎక్కడా రాజకీయ ప్రసంగాలు చేయకుండా కేవలం నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ఎన్నికల ర్యాలీలో పంచుకున్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూడా పాల్గొన్నా.. అతనిపై ఎలాంటి విమర్శలు రాలేదు. కేవలం మోహన్ లాల్ సూపర్ స్టార్ కావడంతో.. ఓటర్లు ప్రభావితం అవుతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ అభ్యర్థి.. హాస్యనటుడు జగదీష్.. మోహన్ లాల్ పై ఫైరయ్యాడు. అంతేకాదు.. తన ప్రత్యర్థి గణేష్.. మోహన్ లాల్ ను బ్లాక్ మెయిల్ చేసి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేశారని అంటున్నాడు. అయితే గణేష్ కుమార్ ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయలేదని.. జగదీష్ ఇలాంటి చెత్త ఆరోపణల్ని మానుకోవాలని దర్శకుడు ఉన్ని కృష్ణన్ సూచించారు. అంతేకాదు.. నటులు ఎన్నికల ప్రాచారంలో పాల్గనరాదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాంటి నిబంధనలు విధించలేదన్నారు.