Begin typing your search above and press return to search.
అలా కుదరదంటున్న మహేష్ ఫ్యాన్స్!
By: Tupaki Desk | 19 Sep 2018 4:41 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబుపై తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ జోకులు వేయడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో పాపులర్ కావడం తెలిసిందే. తెలుగులో టాప్ లీగ్ స్టార్ అయిన మహేష్ పై ఒక ఊరు పేరు లేని స్టాండప్ కమెడియన్ అలా చెలరేగిపోవడంతో మహేష్ ఫ్యాన్స్ కోపం నషాళానికి అంటింది. ఇక చుక్కలు చూపించడం మొదలుపెట్టారు.
ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇలా మనోజ్ ప్రభాకర్ కు సంబంధించిన అన్ని ఖాతాల్లో తిట్టడం.. బెదిరించడం లాంటివి మొదలు పెట్టారు. ఇక ఫోన్ నంబర్ కు కాల్స్ సరే సరి. దెబ్బతో మొత్తం సోషల్ మీడియా ఖాతాలను వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. ఇక ఫోన్ బాధ పడలేక స్విచ్చాఫ్ చేస్తే మనోజ్ ఫ్రెండ్స్.. కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తమ ఆవేదన.. ఆక్రందనను ఆవేశంగా వెళ్ళగక్కడం తో ఇప్పటికే ఒకసారి అపాలజీ చెప్పిన మనోజ్ రెండో సారి సారీ చెబూతూ ఒక వీడియో ను ఫేస్ బుక్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చి మరీ పోస్ట్ చేశాడు. తనవల్ల పొరపాటు జరిగింది కాబట్టి ఆ అవేదన తనతోనే చెప్పుకోవడం న్యాయమని.. తనకు సంబందించిన వాళ్ళను ఇందులోకి లాగొద్దని వేడుకున్నాడు.
ఇక ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. "అందరూ పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. కాని అది నిజం కాదు. 17 నిముషాల నిడివి గల వీడియో ను ఆరు నెలల కింద అప్లోడ్ చేశాం ఇప్పుడు అది న్యూస్ ఐటం అయింది. కానీ మొత్తం వీడియోలో ఒక రెండు రెండు నిముషాల వీడియోను మాత్రమే చూసినప్పుడు మీకు అలా అనిపించవచ్చు. కొంతమంది మా వీడియోను సరిగా రిసీవ్ చేసుకోలేదు. మా వీడియో వల్ల బాధపడ్డ అందరికీ.. ముఖ్యం గా సూపర్ స్టార్ మహేష్ బాబు సార్ అభిమానులకు నేను సిన్సియర్ గా అపాలజీ చెప్తున్నాను. మా ప్రోగ్రామ్ 'అక్కడామి'.. అదొక డమ్మీ అవార్ద్స్ ఫంక్షన్. ఇలాంటి కామెడి ప్రోగ్రామ్స్ హాలీవుడ్ లో..బాలీవుడ్ లో జరుగుతుంటాయి. పెద్ద స్టార్ల మీద రాజకీయ నాయకులపై ఇలా జోకులు వేయడాన్ని 'పంచింగ్ అప్' అంటారు. ఆ టెక్నిక్ ను ఇక్కడ వాడడం జరిగంది. మేము కొత్తగా ఉంటుందని ప్రయత్నించాం. ఇక తెలుగు యాక్టర్ కాబట్టి మేము ఇలా చేశామని చెప్పడం కూడా సరికాదు. మహేష్ బాబు సార్ స్పైడర్ తమిళ చిత్రం. ఇక 2 నిముషాలు మాత్రం ఆ సినిమా గురించి మాట్లాడాము. మిగతా 15 నిముషాలు ఇతర తమిళ సినిమాల గురించి జోకులు వేయడం జరిగింది. మహేష్ బాబు సర్ చాలా పెద్ద స్టార్. అయనంటే మాకు రెస్పెక్ట్ ఉంది. మా వీడియో వల్ల ఎవరి ఫీలింగ్స్ అయినా హార్ట్ అయి ఉంటే వారిని నేను క్షమాపణ కోరుతున్నాను" అన్నాడు.
ఇవన్నీ సరే గానీ తమ హీరోను అనాల్సిందంతా అని ఇప్పుడు తాపీగా 'పంచింగ్ అప్' అని కామెడి కి ట్రై చేశామని చెప్పడం కుదరదంటే కుదరదని అంటున్నారు అభిమానులు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ నో.. అజిత్ నో ఇలానే అంటే ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. వదల బొమ్మాళి టైపులో మనోజ్ ను ఘట్టిగా ఘట్టమనేని ఫ్యాన్స్ తగులుకుంటున్నారు!