Begin typing your search above and press return to search.
బన్నీ సినిమా గురించి పృథ్వి క్లారిటీ
By: Tupaki Desk | 22 Jun 2019 5:54 AM GMTరాజకీయ నేపధ్యంతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కమెడియన్ పృథ్విని అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పించారని కొద్ది రోజుల క్రితం చాలా గట్టి పుకారే షికారు చేసింది. చుట్టూ ఉన్న పరిస్థితులు దానికి బలం చేకూరేలా ఉండటంతో అది నిజమనే అనుకున్నారు అభిమానులు. ఫైనల్ గా పృథ్వినే ఈ వివాదానికి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు.
అసలు తనకు ఆ సినిమాలో ఆఫరే ఇవ్వనప్పుడు తీసేసే ప్రశ్న ఎందుకు వస్తుందని రివర్స్ లో ప్రశ్నించాడు. ఇటీవలే తిరుపతిలో తలనీలాలు ఇచ్చాక ఆ గెటప్ మూవీకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని గుండుతో ఉన్న స్టిల్స్ కూడా త్రివిక్రమ్ కు పంపానని అయితే అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో అవసరం లేదేమో అని సైలెంట్ గా ఉన్నానని చెప్పాడు
సో పృథ్వి విషయంలో వస్తున్న గాసిప్స్ కు దీంతో చెక్ పడినట్టే. మెగా హీరోలు ఎవరూ రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టరని తెలిసి కూడా ఇలాంటి ప్రచారం జరగడం పట్ల మెగా ఫ్యాన్స్ కొంత అసహనంకు గురయ్యారు. దానికి తోడు సోషల్ మీడియాలో ఈ ఇష్యూ ని సైరా మీదకు డైవర్ట్ చేయడం కొంత కామెంట్స్ వార్ కు దారి తీసింది. ఇప్పుడీ పృథ్వి స్టేట్మెంట్ ఒకరకంగా మంచిదే అని చెప్పాలి. అపోహలను తొలగించడంతో పాటు వాతావరణాన్ని తేలికపరుస్తుంది. మెగా ఫ్యామిలీ అంటే తనకు చాలా గౌరవమని రాజకీయాలకు తమ సంబంధాలకు ముడిపెట్టవద్దని కోరుతున్న పృథ్వి ఫైనల్ గా దీనికో ముగింపు ఇచ్చేశాడు