Begin typing your search above and press return to search.

'మా' పెద్ద‌ల‌పై పృథ్వీ నిప్పులు!

By:  Tupaki Desk   |   20 Oct 2019 5:39 PM GMT
మా పెద్ద‌ల‌పై పృథ్వీ నిప్పులు!
X
జీవిత రాజ‌శేఖ‌ర్ నేతృత్వంలో ఆదివారం నిర్వ‌హించిన‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)స‌మావేశం తీవ్ర గంద‌ర‌గోళానికి దారి తీయ‌డం.. సమావేశం మధ్యలో నుంచే సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోవ‌డం.. సీనియ‌ర్ ర‌చ‌యిత‌ - న‌టుడు ప‌రుచూరి గోపాల‌కృష్ణ క‌న్నీళ్లు పెట్టుకుని స‌మావేశం నుంచి నిష్క్ర‌మించ‌డం ప‌ట్ల సంఘం ఈసీ స‌భ్యుడు - ఎస్ వీబీసీ ఛానెల్ ఛైర్మ‌న్ పృథ్వీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ‘మా’ పెద్ద‌ల తీరును అత‌ను దుయ్య‌బ‌ట్టాడు. తాజా ప‌రిణామాలు త‌న‌కేమాత్రం రుచించ‌డం లేద‌ని - తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని అత‌న‌న్నాడు.

‘మా’ అధ్యక్షుడు నరేష్‌ కు తెలియకుండానే సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ ఉన్న జీవితా రాజశేఖర్.. ఆదివారం ఫిలిం ఛాంబర్‌ లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశానికి నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ వర్గం.. జీవితా రాజశేఖర్ వర్గం మధ్య మాటల యుద్ధం జరిగింది. అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేష్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. అయితే ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్‌ తెలిపారు. అయినా అవ‌తలి వ‌ర్గం ఊరుకోలేదు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగి స‌మావేశం ర‌సాభాస‌గా మారింది.

ఈ నేప‌థ్యంలో పృథ్వీ మాట్లాడుతూ.. తనకు ఈసీ స‌భ్యుడి‌ పదవి అక్కర్లేదని, ‘మా’ తీరు మారకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించాడు. ఈసీ స‌భ్యుడిగా గెలిచినందుకు ఆనందపడాలో - బాధపడాలో తెలియడం లేదన్నాడు. ‘మా’లో ఎవరి గ్రూపులు వాళ్లు పెట్టుకున్నారని.. స‌భ్యులు కూడా ఎవ‌రిష్టం వచ్చిన‌ట్లు వాళ్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారని పృథ్వీ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరని గోపాలకృష్ణని ఘోరంగా అవమానించారని విమర్శించాడు.