Begin typing your search above and press return to search.

ఆడాళ్ల ఫోనొస్తే మ‌స్కా కొట్ట‌డ‌మెలా?

By:  Tupaki Desk   |   18 Dec 2018 9:10 AM GMT
ఆడాళ్ల ఫోనొస్తే మ‌స్కా కొట్ట‌డ‌మెలా?
X
ఇటీవ‌ల `మీటూ` ప్ర‌కంప‌నాల గురించి తెలిసిందే. దేశ‌వ్యాప్తం గా ఈ ఉద్య‌మం ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ ఉద్య‌మ ప్ర‌భావం టాలీవుడ్‌ పై ఏమంత క‌నిపించ‌లేదు. అడ‌పా ద‌డ‌పా శ్రీ‌రెడ్డి లాంటి వాళ్లు మీడియాకెక్కి ర‌చ్చ చేసిన ఉదంతాలు త‌ప్ప మీటూ వ‌ల్ల ఇక్కడ ఏ పెద్ద త‌ల‌కాయ బ‌య‌టికి రాలేదు. దీంతో అస‌లు టాలీవుడ్‌ లో ఇలాంటిదేమీ లేదా? అస‌లు కాస్టింగ్ డైరెక్ట‌ర్ల వ‌ల్ల మ‌గువ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేవా? అన్న సందేహాలు క‌లిగాయి. దీని పై ప‌రిశ్ర‌మ‌కు చెందిన సీనియ‌ర్ క‌మెడియ‌న్ 30 ఈర్స్ పృథ్వీని అడిగేస్తే ఓ షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు.

ఆరోపించ‌డం అనేది ప్యాష‌న్ అయిపోయింది. మ‌గాళ్ల వ‌ల్లే కాదు.. ఆడాల్ల వ‌ల్లా ఎంద‌రో మోస‌పోతున్నారు. అలాంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాం. అయితే దానికి ప్ర‌చారం లేదు!! అని పృథ్వీ అన్నారు. మీకు ఆడాళ్ల వ‌ల్ల చిక్కులేవైనా వ‌చ్చాయా? అంటే .. అస‌లు మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అనేశారు. ``చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. వాళ్లు బ‌య‌టికి రారు`` అని వేరొక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. ఇటీవ‌లి కాలంలో మీరు ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడేస్తున్నారు.. దూకుడుగా ఉంటున్నారేంటి? అని ప్ర‌శ్నిస్తే .. త‌ప్ప‌దు .. ఇక్క‌డ ఎవ‌రికి ఉండేది వాళ్ల‌కు ఉంటుంది అని అన్నారు. ఇలా మాట్లాడేస్తే అవ‌కాశాల ప‌రంగా చిక్కులుంటాయి క‌దా? అంటే .. ``పృథ్వీ కావాల్సిన వాళ్లే పృథ్వీ ద‌గ్గ‌రికి వ‌స్తారు. రాని వాళ్ల గురించి ఆలోచించ‌ను. అస‌లు భ‌య‌ప‌డేదే లేదు!`` అని చాలా డేరింగ్‌గానే వ్యాఖ్యానించారు ఈ సీనియ‌ర్ న‌టుడు.

ఇటీవ‌లి కాలంలో సోషల్ మీడియా ఉధృతి, మీడియా వ‌ల్ల వ‌చ్చిన ముప్పు గురించి పృథ్వీ సూటిగా మాట్లాడారు. ఎవ‌రైనా అమ్మాయి నుంచి ఫోనొస్తే చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నామ‌ని ఒక షాకింగ్ ట్రూత్‌ ని పృథ్వీ రివీల్ చేశారు. లేదంటే ఆ ఫోన్‌ లో మాట్లాడేది టీవీ చానెళ్ల లైవ్‌ లో వ‌చ్చేస్తోంది. ఇదిగో లైవ్ లైన్‌ లో పృథ్వీ మాట్లాడుతున్నాడు!! అంటూ స్టింగ్ ఆప‌రేష‌న్ చేసేస్తున్నారు.. అందుకే ఫోన్ తీయ‌గానే జై సాయి రామ్ అనేస్తున్నాం అనీ అన్నారు. కృష్ణ భ‌గ‌వాన్ లాంటి సీనియ‌ర్లు అయితే ఫోన్ తీయ‌గానే ఓం సాయిరామ్ అనేస్తున్నారు.. అనీ అన్నాడు. మొత్తానికి ఇండ‌స్ట్రీలో అస‌లేం జ‌రుగుతోందో లోగుట్టు విప్పాడు పృథ్వీ. మీడియా లైవ్‌ల‌కు చిక్క‌కుండా, మీటూల‌కు చిక్క‌కుండా ప‌రిశ్ర‌మ‌లో ఆ త‌ర‌హా ప్ర‌ముఖులు చాలా జాగ్ర‌త్త‌గానే ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక‌పోతే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు, క‌మెడియ‌న్ల‌ కు ఇలాంటి విభాగంలో ఏం ఉంటుంది? పైగా పెళ్ల‌యి, పిల్ల‌లు ఉన్నారు.. మ‌న‌వ‌లు ఉన్నారు క‌దా! అనేశాడు పృథ్వీ.