Begin typing your search above and press return to search.
నేనెవరి అవకాశాలూ లాక్కోలేదు - పృథ్వీ
By: Tupaki Desk | 12 Dec 2015 9:51 AM GMTసినీ పరిశ్రమలో ఎవ్వరూ ఎవరి అవకాశాలూ లాక్కోలేరని అన్నాడు రైజింగ్ కమెడియన్ పృథ్వీ. ‘లౌక్యం’లో బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర వేసినప్పటి నుంచి పృథ్వీ సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే.. మరోవైపు బ్రహ్మానందం క్రమక్రమంగా ఫేడవుట్ అయిపోతున్నాడు. ఈ మధ్య బ్రహ్మి చేయాల్సిన పాత్రలు కొన్ని పృథ్వీకి వెళ్తున్నాయన్న ప్రచారం కూడా నడుస్తోంది. ‘బెంగాల్ టైగర్’ సక్సెస్ మీట్లో భాగంగా మీడియాను కలిసిన పృథ్వీ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాగా.. ‘‘పరిశ్రమలో ఎవరూ ఎవరి అవకాశాలూ లాక్కోలేరు. నన్ను పరిశ్రమలోకి తీసుకొచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి నా అభిమాన నటుడు శోభన్ బాబును కలవాలంటే ఆయనింటికి తీసుకెళ్లాడు. ఆ సందర్భంగా ఆ మహానుభావుడు ఓ మాట చెప్పాడు. శోభన్ బాబు శోభన్ బాబే.. పృథ్వీ పృథ్వీనే. నువ్వు నీలా ఉండు అని చెప్పాడు. కాబట్టి ఎవరి ప్రత్యేకత వారిదే. నేనూ ఎవరి అవకాశాల్నీ లాక్కోలేదు’’ అన్నాడు పృథ్వీ.
పాతికేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా సరైన గుర్తింపు రావడానికి చాలా ఏళ్లు పట్టిందని.. ఎప్పటికైనా ఓ మోస్తరు గుర్తింపు ఉన్న పాత్రయినా చేస్తానా అని ఎదురు చూశానని.. కానీ ఇప్పుడు తాను కోరుకున్నదానికంటే గొప్ప పాత్రలు వస్తున్నాయని.. ఇలా మీడియా వాళ్ల మందు కూర్చుని మాట్లాడే అవకాశం వస్తుందని కూడా ఎప్పుడూ ఊహించలేదని పృథ్వీ చెప్పాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డానని.. పెళ్లాం పిల్లల్ని ఎలా చూసుకుంటానో అని భయపడ్డానని.. దేవుడి దయ వల్ల ఇంత కాలానికి తనకు బ్రేక్ వచ్చిందని.. ఇదంతా దర్శకులు, నిర్మాతలు, రచయితల చలవేనని పృథ్వీ చెప్పాడు. రెమ్యూనరేషన్ల విషయంలో డిమాండ్లు ఏమీ లేవని.. నిర్మాతలు ఇచ్చింది తీసుకుంటున్నానని అన్నాడు.