Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ .. న‌డిచే అగ్ని గోళ‌మ‌ట‌

By:  Tupaki Desk   |   4 Dec 2017 4:05 PM GMT
ప‌వ‌న్ .. న‌డిచే అగ్ని గోళ‌మ‌ట‌
X
పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ర్టాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులే కాదు ఇండస్ర్టీలో ఉన్నవారిలోనూ ఆయన్ను ఇష్టపడే వారి లిస్టు భారీగానే ఉంది. పవర్ స్టార్ అంటూ అభిమానులు క్రేజీగా పిలుచుకునే పవన్ పవర్ స్టార్ మాత్రమే కాదని, ఆయన నడిచే అగ్నిగోళం అంటున్నారు 30 ఇయర్స్‌గా ఇండస్ర్టీని చూస్తున్న స్టార్ కమెడియన్ పృథ్విరాజ్. ఓ వెబ్ ఛానల్ తో మాట్లాడిన ఆయన పవన్ గురించి చాలా ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు. పవన్ ను తాను పొగడడం లేదని - వాస్తవాలు మాట్లాడుతున్నానని... మనసులోంచి వచ్చిన మాటలని ఆయన అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ ను తాను ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేదని... పవన్ వ్యక్తిత్వం - మంచితనం చూసి స్పందిస్తున్నాను తప్ప డబ్బా కొట్టడానికో - ఆయనతో సినిమాలు చేయడానికో మాత్రం కాదని పృథ్వి చెప్పుకొచ్చారు. పవన్ ఒక నడిచే అగ్నిగోళమని ఆయన అన్నారు. అంతేకాదు... పవన్ తనను ఏమని పిలుస్తారో కూడా ఆయన చెప్పారు. తాను కనిపించగానే స్పురద్రూపి అని పిలుస్తారని చెప్పారు.

పవన్ ను తాను రీసెంట్‌ గానే చూసినప్పుడు పక్కన ఒక కూజా - ఒక మట్టిగ్లాసు ఉన్నాయని... ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ పర్సనో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని అన్నారు. ఆయనని చూసి ఎంతో నేర్చుకోవాలన్నారు. మన ముందున్న మేధావులను మనం గుర్తించలేకపోతున్నామంటూ పవన్ గురించి చెప్పారు.