Begin typing your search above and press return to search.
కాస్టింగ్ కౌచ్ గురించి పృథ్వీ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 10 April 2017 10:51 AM GMTఈ మధ్య అన్ని ఇండస్ట్రీల్లోనూ కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద డిస్కషనే నడుస్తోంది. మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల వ్యవహారం చర్చనీయాంశం అయిన దగ్గర్నుంచి చాలామంది హీరోయిన్లు.. తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి గళం విప్పుతున్నారు. ఇండస్ట్రీ జనాలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. తనను ఓ నిర్మాత పడుకోమన్నాడని ఒక హీరోయిన్.. తనను ఓ దర్శకుడు లైంగికంగా వేధించాడని మరో హీరోయిన్.. ఇలా చాలామందే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై కమెడియన్ పృథ్వీకి మండిపోయింది. వాళ్లందరిపై పృథ్వీ ఎదురుదాడికి దిగాడు.
ఇండస్ట్రీలో బతుకుతూ.. ఇండస్ట్రీ ఇచ్చే డబ్బులే తింటున్న వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల.. సినిమా రంగం.. టీవీ రంగం మీద చులకన భావం ఏర్పడుతోందని పృథ్వీ చెప్పాడు. ఇలా మాట్లాడుతున్న వాళ్లకు నటి హేమ ఓ ఇంటర్వ్యూలో చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పిందని పృథ్వీ అన్నాడు. నిర్మాతలు.. సహనటులు.. దర్శకుల గురించి ఇలా ఏది పడితే అలా మాట్లాడటం చాలా దారుణమన్నాడు పృథ్వీ. ‘‘ఒకావిడ ఓ డైరెక్టర్.. ఓ ప్రొడ్యూసర్ వల్ల తన కెరీర్ నాశనం అయిందని అని స్టేట్మెంట్ ఇస్తుంది. మరొకావిడ నాతో ఒకరు పడుకున్నారని అంటుంది. ఒకావిడ తనను పాడు చేసారని అంటుంది. ఇంకొకరు అర్దరాత్రి వచ్చి తలుపు కొట్టాడని అంటుంది. ఐతే స్త్రీ సహకారం లేనిదే ఏదీ జరుగదు. వాళ్ల సహకారం లేకుండా ఇవన్నీ జరిగాయంటే నేను నమ్మను. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు ఉన్నారనే అనుకుందాం. కానీ వాళ్లు పిలిచినపుడు నువ్వెందుకు వెళ్లాలి? నువ్వు పిలిచావు కాబట్టే వచ్చి నీ తలుపు కొట్టాడు’’ అంటూ పృథ్వీ ధ్వజమెత్తాడు.
ఒకప్పట్లా ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితి లేదని.. చాలామంది చదువుకున్నవాళ్లు వచ్చారని.. అందరూ సంస్కారవంతులే అని.. ఎవరైనా సరే ఇష్టమైతే నటించాలని.. లేదంటే వెళ్లిపోవాలని.. ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అని పృథ్వీ అన్నాడు. ఇంటర్వ్యూలు చేసేవాళ్లు కావాలనే వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు అడుగుతున్నారని.. సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తున్నారని.. ఇవి సమరం ఇంటర్వ్యూల్లా ఉంటున్నాయని పృథ్వీ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/