Begin typing your search above and press return to search.
ఆ నటుడి దీన స్థితి.. మాకు గుణపాఠం
By: Tupaki Desk | 21 Dec 2018 1:30 AM GMTకమెడియన్ పృథ్వీ సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కుస్తీలు పడుతూ వచ్చి ఎట్టకేలకు గుర్తింపును దక్కించుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా పృథ్వీ టాప్ కమెడియన్ గా కొనసాగుతూ వస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, పోయిన తర్వాత కూడా కొందరు గుర్తుండి పోతారు. అయితే ఆ పోయిన వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంతగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కమెడియన్ పృథ్వీ చెప్పిన విషయం ఇండస్ట్రీలోని పరిస్థితికి అద్దం పడుతుంది.
సీనియర్ నటుడు హరనాథ్ గురించి పృథ్వీ మాట్లాడుతూ... నేను సీరియల్స్ లో నటించే సమయంలో పద్మాలయ స్టూడియోస్ కు షూటింగ్ కు వెళ్లే వాడిని. అక్కడ ఒక రోజు గేటు ముందు గడ్డం పెరిగి, చిరిగిన షర్ట్ వేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన్ను పద్మాలయ గేటు వద్ద ఆపి సిబ్బంది లోనికి వెళ్లనివ్వడం లేదు. ఆయన్ను నేను గుర్తు పట్టి దగ్గరకు వెళ్లాను. మీరు హరనాథ్ గారు కదా అంటే అవును అంటూ సమాధానం ఇచ్చారు. కృష్ణ గారిని కలవాలని వచ్చానంటూ నాతో చెప్పడంతో నేను లోనికి తీసుకు వెళ్లాను.
స్టూడియోలోకి వెళ్లిన తర్వాత కృష్ణగారు చెప్పడంతో ఆయనకు స్నానం చేయించి, కృష్ణ గారి డ్రస్ వేశారు. ఆ తర్వాత కృష్ణగారు వచ్చి హరనాథ్ గారిని కలిశారు. వారం రోజుల పాటు కృష్ణ గారు హరనాథ్ గారిని తనతోనే ఉంచుకున్నారు. ఆ తర్వాత చెన్నైకు పంపించారు. హరనాథ్ గారు చెన్నైకి వెళ్లిన రెండు రోజులకే మృతి చెందారు. హరనాథ్ గారి జీవితం మాలాంటి వారికి గుణపాఠం. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే హరనాథ్ గారి లాంటి పరిస్థితి అందరికి వస్తుందని పృథ్వీ ఈతరం క్యారెక్టర్ ఆర్టిస్టులకు మరియ కమెడియన్స్ కు సూచించాడు.