Begin typing your search above and press return to search.

వాడుకుంటే ఎక్కడికో వెళ్లిపోవచ్చు!

By:  Tupaki Desk   |   20 Aug 2018 6:20 AM GMT
వాడుకుంటే ఎక్కడికో వెళ్లిపోవచ్చు!
X
పైకి కనిపించినా కనిపించకపోయినా టాలీవుడ్ కు కమెడియన్ల కొరత ఉందన్న మాట నిజం. ఏదోలా మానేజ్ చేసే యాక్టర్లకు లోటేమి లేదు కానీ తమ టైమింగ్ తో మాములు సన్నివేశాలను సైతం రక్తి కట్టించగల హాస్య నటులు మాత్రం ఈ మధ్య బాగా తగ్గిపోయారు. బ్రహ్మానందం-ఏవీఎస్-ఎంఎస్-ధర్మవరపు రేంజ్ ఆర్టిస్టులను ఆశించలేం కానీ కనీసం చూస్తున్నంత సేపు నవ్వించగలిగే సత్తా ఉంటే చాలు సెటిల్ అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాహుల్ రామకృష్ణ అదే దారిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇటీవలే వచ్చిన గీత గోవిందంలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా అతనికి సలహా ఇచ్చి హీరోయిన్ కు ముద్దు పెట్టించి కథలో కీలకమైన మలుపుకు కారణమైన తాగుబోతు పాత్రలో బాగా మెప్పించాడు.

నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి అదే పనిగా ఇతని పేరు వెంటనే గుర్తు లేకపోయినా పాత్ర గురించి చెప్పి తర్వాత అతని దగ్గరకు తీసుకుని మరీ ప్రకటించడం చూస్తే కుర్రాడు లూప్ లైన్ లో పడ్డాడనే చెప్పుకోవాలి. కాకపోతే రాహుల్ రామకృష్ణకు సరైన కథలు పడాలి. డిమాండ్ పీక్స్ లో ఉన్న వెన్నెల కిషోర్ కు ఖచ్చితంగా చెప్పుకునే పోటీ నిజంగానే ఎవరూ లేరు. అందుకే హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి చివర్లో బకరాగా మిగిల్చే హిలేరియస్ పాత్రలన్నీ అమీ తుమీ మొదలుకుని గీత గోవిందం దాకా అన్ని వెన్నెల కిషోర్ కే దక్కుతున్నాయి. సో రాహుల్ రామకృష్ణ లాంటి కమెడియన్లు ఇంకాస్త సాలిడ్ పాత్రలతో ఋజువు చేసుకుని కొన్ని హిట్లు కొట్టారంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. బ్రహ్మానందంలాగా వెయ్యి సినిమాలు చేసే సీన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికీ లేదు కానీ ఉన్న ఐదు లేదా పదేళ్లలో మంచి పాత్రలు కనక పట్టగలిగితే స్టార్ కమెడియన్ గా సెటిలైపోవచ్చు.