Begin typing your search above and press return to search.
రైజింగ్ కమెడియన్.. దంచేస్తున్నాడు
By: Tupaki Desk | 23 Nov 2016 10:30 PM GMTసునీల్ కామెడీ మానేశాక.. ఎమ్మెస్ వెళ్లిపోయాక.. బ్రహ్మానందం జోరు తగ్గపోయాక తెలుగు సినిమాలు కామెడీ పరంగా కొంచెం వీక్ అయిన మాట వాస్తవం. ఐతే ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు కమెడియన్లు తమ ప్రత్యేకతను చాటుకుంటూ.. ఈ తరం ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లు కామెడీ పండిస్తూ.. తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు.
వెన్నెల కిషోర్.. సత్య లాంటి కమెడియన్లు ఈ కోవకే చెందుతారు. వెన్నెల కిషోర్ దశాబ్దం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అతను స్టార్ కమెడియన్. అతడి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే సత్య స్టార్ స్టేటస్ సంపాదించలేదు కానీ.. తాను నటించే ప్రతి సినిమాలోనూ నవ్వులు పండిస్తూ.. ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తున్నాడు. ఈ మధ్య అతడికి కీలకమైన పాత్రలు దక్కుతున్నాయి. స్క్రీన్ టైం బాగా పెరుగుతోంది. నాని సినిమా ‘మజ్ను’లో హీరో పాటే ఉండే కీలకమైన పాత్రలో అదరగొట్టాడు సత్య. అతడి కెరీర్లో ఇదే అత్యంత కీలకమైన పాత్ర.
ఇక టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లోనూ సత్య పాత్ర భలేగా పేలింది. ఇందులోనూ సత్య ఆరంభం నుంచి చివరి దాకా సందడి చేస్తూనే ఉంటాడు. తనదైన టైమింగ్ తో నవ్వులు పండించాడు సత్య. దయ్యం కాంబినేషన్లో అతడి సీన్లు కడుపుబ్బ నవ్వించాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లేటుగా యాడ్ చేసిన కొన్ని జోకులు సత్య పాత్రకే పెట్టారు. సత్య తనదైన శైలిలో ఆ జోకులు పేల్చాడు. ద్వితీయార్ధంలో దెయ్యంతో దెబ్బలు తినే సీన్లో అయితే సత్య మామూలుగా నవ్వించలేదు. వెన్నెల కిషోర్ కు దీటుగా నటించి మెప్పించాడు.
సత్య బాడీ లాంగ్వేజ్.. అతడి కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా ఉంటాయి. చూడగానే నవ్వు తెప్పిస్తాయి. ఈ మధ్య కొందరు కమెడియన్ల విషయంలో తలెత్తుతున్న ప్రధానమైన ఇబ్బంది.. కొన్నాళ్ల తర్వాత మొనాటనీ వచ్చేయడం. ఆ కమెడియన్లు ఉన్నట్లుండి రైజ్ అవుతారు. ఐతే కొన్నాళ్ల తర్వాత వాళ్లను చూస్తే మొనాటనీ వచ్చేస్తుంది. సత్య మాత్రం అలా కనిపించడు. అతడి కామెడీ సినిమా సినిమాకూ కొత్తగానే ఉంటోంది. ఈ మధ్య చేసిన సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన సత్య.. మున్ముందు మరింత బిజీ అయ్యే అవకాశముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/