Begin typing your search above and press return to search.

లీడ్ రోల్ లో సత్య.. ‘ఆహా’ అనిపించ‌బోతున్న క‌మెడియ‌న్!

By:  Tupaki Desk   |   12 April 2021 2:30 AM GMT
లీడ్ రోల్ లో సత్య.. ‘ఆహా’ అనిపించ‌బోతున్న క‌మెడియ‌న్!
X
టాలీవుడ్ లో టాలెంటెడ్ క‌మెడియ‌న్ గా పేరు తెచ్చుకున్నారు స‌త్య‌. ఫ‌లితంతో సంబంధం లేకుండా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న న‌టించిన సినిమాల‌న్నీ పేరు తెచ్చిన‌వే. త‌న‌దైన మేన‌రిజం.. అద్బుత‌మైన టైమింగ్ తో దూసుకెళ్తున్నారు స‌త్య‌. ఇక‌, ఆయ‌న‌ డైలాగ్ డెలివ‌రీ కూడా ఎంతో ప్ర‌త్యేకత‌ను సంత‌రించుకుంది.

అలాంటి సత్యతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. ఈ సిరీస్ లో స‌త్య లీడ్ రోల్ లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగు ఓటీటీగా ఉన్న ‘ఆహా’.. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు సమాచారం. ఆహా ఓటీటీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందినదని తెలిసిందే.

గీతా ఆర్ట్స్-2 బ్యానర్ ద్వారా చిన్న సినిమాలను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లోనే సత్య వెబ్ సిరీస్ రాబోతోందని తెలుస్తోంది. దీంతోపాటు ఇంకా ప‌లు సిరీస్ ల‌ను కూడా నిర్మించే ప‌నిలో ఉన్న‌ట్టు స‌మాచారం.