Begin typing your search above and press return to search.
కమెడియన్ కి కాలం కలిసొస్తే ఇలాగే ఉంటది మరి!
By: Tupaki Desk | 14 Aug 2022 5:37 AM GMTటాలీవుడ్ కమెడియన్స్ లో శ్రీనివాసరెడ్డి ఒకరు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. దాదాపు స్టార్ హీరోలందరి కాంబినేషన్లోను ఆయన నవ్వించాడు. బ్రహ్మానందం .. ఎమ్మెస్ .. ఏవీఎస్ వంటి సీనియర్ల ధాటిని తట్టుకుని ఆయన నిలబడ్డాడు. అటు సునీల్ .. ఇటు వెన్నెల కిశోర్ రాజ్యం కొనసాగుతున్నప్పుడు కూడా తనకంటూ కొన్ని అవకాశాలు వచ్చేలా చేసుకోగలుగుతున్నాడు. కొంతమంది కమెడియన్స్ మాదిరిగా హీరో వేషాల వైపు వెళ్లినా, కామెడీని మాత్రం వదిలిపెట్టలేదు. తాను కమెడియన్ ను మాత్రమే అంటూ ఆ రూట్లో వెళ్లడానికే ఆసక్తిని చూపుతూ వచ్చాడు.
శ్రీనివాస్ రెడ్డికంటూ ఒక టైమింగ్ ఉంది .. ఆయన డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ స్థాయికి తగిన టైమింగ్ ఆయనలో కనిపిస్తుంది. ఇక ఈ జనరేషన్లో 'చిత్రగుప్తుడు' పాత్రను పోషించాలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఆయనే. అలాంటి శ్రీనివాస్ రెడ్డి వరుస సినిమాలు చేస్తూనే వస్తున్నాడు కానీ, ఆయన స్థాయికి తగిన పాత్రలు పడటం లేదు. దాంతో కెరియర్ పరంగా ఆయన కాస్త వెనకబడినట్టుగా అనిపించింది కూడా. కానీ ఇప్పుడు చూస్తే కాలం మళ్లీ ఆయనకి అనుకూలంగా మారుతున్నట్టుగానే అనిపిస్తోంది.
ఇటీవల వచ్చిన 'బింబిసార' సినిమాలోని 'జుబేదా' పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. మీసాలు మెలి తిరిగిన లుక్ తో .. రాజుగారి ప్రధానమైన అనుచరుడిగా .. చెలికాడుగా 'ప్రభూ .. ప్రభూ' అంటూ ఆ పాత్రలో ఆయన కితకితలు పెట్టేశాడు. ఇకపై ఎవరైనా జానపదాలు చేస్తే శ్రీనివాసరెడ్డి లేకుండా చేయడం కష్టం అనిపించేలా ఆయన ఆ పాత్రను పండించాడు. తమిళంలో వడివేలు తరహాలో ఆయన చేసిన సందడి ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది. అలాగే శ్రీనివాసరెడ్డి కెరియర్ కి కూడా.
'బింబిసార'లోని 'జుబేదా' పాత్రను గురించి జనాలు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే, 'కార్తికేయ 2'లో కృష్ణ భక్తుడిగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో 'ద్వారక' చేరుకున్న దగ్గర నుంచి చివరివరకూ ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడు. ఈ పాత్రలోను ఆయన మార్క్ స్పార్క్ డైలాగులతో నవ్వించాడు. సరైన పాత్ర పడితే చాలు శ్రీనివాస రెడ్డి చెలరేగిపోతాడనే విషయాన్ని ఆయన మరోసారి నిరూపించాడు. చాలా తక్కువ గ్యాప్ లో వచ్చిన రెండు సినిమాలలోని విభిన్నమైన పాత్రలు శ్రీనివాస రెడ్డి కెరియర్ కి మంచి హెల్ప్ అవుతాయని చెప్పచ్చు. తనకి ఇలాంటి పాత్రలను ఇచ్చిన ఇద్దరి దర్శకులతో కలిసి ఆయన ఐమాక్స్ థియేటర్ దగ్గర నిన్న సందడికి చేశాడు. ఆ సమయంలో తీసుకున్న ఫొటోనే ఇది.