Begin typing your search above and press return to search.
సినిమాల్లోకి మరో వారసుడు.. ప్రముఖ కమెడియన్ కొడుకు ఎంట్రీ!
By: Tupaki Desk | 24 March 2021 12:30 PM GMTవెండితెరపై కమెడియన్ సుధాకర్ స్టామినా ఏంటన్నది అందరికీ తెలిసిందే. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా.. ఆయన పోషించిన ప్రతీ పాత్ర ప్రేక్షకులను అలరించింది. అయితే.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆయన.. కమెడియన్ పిచ్చకొట్టుడు సుధాకర్ గానే సుపరిచితుడు. సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడే హీరోగా ఓ వెలుగు వెలిగారు.
సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్ లో ఉండేవారు. ఆ సమయంలో దర్శకుడు భారతీ రాజా సుధాకర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా.. ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ అనే చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశారు సుధాకర్. ఆ తర్వాత.. ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు, సూపర్ హిట్లతో తమిళనాట స్టార్ హీరోగా మారిపోయారు. దాదాపు 45 చిత్రాల్లో హీరోగా నటించారు. సుధాకర్ హీరో అయిన చాలా కాలం తర్వాత చిరంజీవికి అవకాశం వచ్చింది.
ఆ తర్వాత ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తరలివచ్చింది. ఈ క్రమంలోనే తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన ‘యముడికి మొగుడు’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు సుధాకర్. నటుడిగానే కాకుండా.. పలు చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. ఆ తర్వాత 2010లో అనారోగ్యానికి గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ తో దాదాపు 40 రోజులు కోమాలో ఉన్నారు.
ఆ తర్వాత సుధాకర్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్న ఆయన.. వేగంగా నడవలేకపోతున్నట్టు చెప్పారు. కాగా.. తన కుమారుడు బెనిడిక్ మైఖేల్ సినిమాల్లోకి రాబోతున్నట్టు సుధాకర్ ప్రకటించారు. ఓ ప్రాజెక్టు సిద్ధమైందని, స్క్రిప్టు వర్క్ కూడా జరుగుతోందని తెలిపారు. కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు.
కాగా.. బెనిడిక్ మాట్లాడుతూ.. తాను హీరోగానే చేయాలని చూడట్లేదని, నాన్నలా ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో సినిమాల గురించి పెద్దగా ఆలోచించలేదని, ఇప్పుడు మాత్రం యాక్టింగ్ పై ఇంట్రస్ట్ పెరిగిందని చెప్పాడు బిన్నీ. మరి, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఇతర వివరాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.