Begin typing your search above and press return to search.
సునీల్ కుమార్తె-కుమారుడు ఇప్పడేంచేస్తున్నారో తెలుసా?
By: Tupaki Desk | 23 March 2023 1:30 AM ISTహీరో కం కమెడియన్ సునీల్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెడియన్ గా ఎంటర్ అయి హీరోగా ప్రమోట్ అయ్యారు. హీరో కెరీర్ కొన్నాళ్ల పాటు బాగానే సాగింది. కానీ అటుపై మళ్లీ కమెడియన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూటర్న్ తప్పలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ స్నేహితుడిగానూ పరిశ్రమలోనూ మంచి పేరు సంపాదించారు.
అయితే సునీల్ వ్యక్తిగత విషయాలు మాత్రం మీడియాలో పెద్దగా వెలుగులోకి రావు . ఏ నాడు సునీల్ తన భార్య పిల్లల్ని మీడియా మందుకు తీసుకొచ్చింది లేదు. ఆయన హీరోగా కొనసాగిన సమయంలోనే ఏ ఈవెంట్ లో కూడా తన కుటుంబ సభ్యులు హాజరు కాలేదు.
ఇండస్ట్రీ వైపు తీసుకు రావడం ఇష్టం లేక అలా చేసారా? లేక ఆయన కుటుంబ సబ్యులకే ఇష్టం లేదా? అన్నది తెలియదు గానీ! సునీల్ కూడా ఆ విషయాల గురించి పెద్దగా మాట్లాడరు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాలు బయటకు వచ్చాయి. సునీల్ కి ఇద్దరు పిల్లలు. పాప పేరు కావ్య కుందన. పదవతరగతి పూర్తిచేసింది. ఇప్పుడే కాలేజీలో కి ఎంటర్ అవుతుందన్నారు.
అలాగే బాబు ఆరవ తరగతి చదువుతు న్నాడు. మరి పిల్లల్ని సినిమాల్లోకి తీసుకొస్తారా? అని అడిగితే 'అది నా చేతుల్లో లేదు. వాళ్ల లైఫ్ ఎలా డిసైడ్ చేసుకుంటే అలా ముందుకెళ్తారు.
నా భార్య పేరు శ్రుతి. ఇంట్లోనే ఉంటారు. అమ్మ అందరం కలిసి ఓకే ఇంట్లో ఉంటాం. నా బిజీలో నేను ఉంటుంటాను' అన్నారు. మరి సునీల్ కుమారుడిని పరిశ్రమ వైపు తీసుకొస్తారా? అన్నది చూడాలి. నటుడిగా సునీల్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన్ని ఎంతో మంది అభిమానిస్తారు. సునీల్ లో డౌన్ ఎర్త్ క్వాలిటీ అందర్ని ఆకట్టుకునేలా చేస్తుంది. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ సునీల్ మృదుస్వభావి గలవాడు అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.