Begin typing your search above and press return to search.

త‌ప్పు చేశానంటున్న కామెడీ హీరో

By:  Tupaki Desk   |   29 Aug 2017 1:33 PM GMT
త‌ప్పు చేశానంటున్న కామెడీ హీరో
X
క‌మీడియ‌న్ గా కాస్త క్రేజ్ రాగానే హీరోగా మారే సంస్కృతి టాలీవుడ్ లో ఇప్పుడు స‌ర్వ‌సాధ‌ర‌ణం అయిపోయింది. స్టార్ క‌మీడియ‌న్ల ద‌గ్గ‌ర నుంచి నిన్న మెన్న‌నే పాపులారిటీ తెచ్చుకున్న జ‌బ‌ర్థ‌స్థ్ క‌మీడియ‌న్లు వ‌రుకు హీరోలుగా ప్ర‌మోట్ అవుతూనే ఉన్నారు. అయితే ఎంత‌మంది ఇలా హీరోలుగా మారినా కొంద‌రు క‌మీడియ‌న్లు మాత్ర‌మే బాక్సాఫీస్ గండాన్ని దాట‌గ‌లిగే స్టామినా తెచ్చుకుంటున్నారు. అలా వ‌రుస హిట్లుతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న క‌మీడియ‌న్ ట‌ర్న్ హీరోగారి కెరీర్ ఇప్పుడు ఆశించినంత స్థాయిలో లేద‌ని స‌మాచారం. క‌మీడియ‌న్ గా రోజుకి అయిదారు ల‌క్ష‌లు పైనే తీసుకునే టైమ్ లో హీరోగా మారిన ఆ హాస్య‌న‌టుడికి ఆ త‌రువాత టైమ్ బాగానే ఉంది.

కానీ హీరోగా మారి మార‌డంతోనే మాస్ - యాక్ష‌న్ అంటూ త‌న రేంజ్ కి మించిన క‌థ‌ల్ని ఎంచుకోవ‌డంతో ఆ క‌మీడియ‌న్ డౌన్ ఫాల్ స్టార్ అయింద‌నే టాక్ ఉంది. ఇదే విష‌యాన్ని ఆ కామెడీ హీరో కూడా ప‌లువురు ద‌గ్గ‌ర ప్ర‌స్తావించి తాను హీరోగా మారి త‌ప్పు చేసినట్లుగా వాపోతున్నాడ‌ట‌. హీరోగా మారి త‌న కామెడీ ట్రాక్ వ‌ద‌ల‌కుండా ఉండాల్సింద‌ని, అన‌వ‌స‌రంగా యాక్ష‌న్ - ఫైట్లు అంటూ రాంగ్ రూట్ లోకి వెళ్లి కెరీర్ ని గాఢి త‌ప్పేలా చేశానంటూ బాధ‌ప‌డుతున్న‌ట్లుగా ఆ క‌మీడియ‌న్ స‌న్నిహితులు చెబుతున్నారు. అలానే ప్ర‌స్తుతం త‌న కెరీర్ ని మ‌ళ్లీ ట్రాక్ ఎక్కించేందుకు ఓ న‌లుగురు క‌మీడియ‌న్ల‌తో క‌లిసి ఓ కామెడీ సినిమాలో న‌టించేందుకు ఆ కామెడీ హీరో స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలిసింది. ప్ర‌స్తుతం రైజింగ్ లో ఉన్న న‌లుగురు క‌మీడియ‌న్లు ఆ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లుగా చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. వారితో పాటే ఓ క్యారెక్ట‌ర్ గా ఆ కామెడీ హీరో క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఈ సినిమాతో మెల్లిగా మ‌ళ్లీ కమీడియ‌న్ గా యుట‌ర్న్ తీసుకోవ‌డానికి ఆ కామెడీ హీరో ప్లాన్ చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి మ‌ళ్లీ క‌మీడియ‌న్ గా రీ ఎంట్రీ ఇవ్వాల‌ని ట్రై చేస్తున్న ఆ కామెడీ హీరోని ప్రేక్ష‌కులు ఏ రీతిన రిసీవ్ చేసుకుంటారో చూడాలి.