Begin typing your search above and press return to search.
రాజమౌళి వలనే అలా చేశాం
By: Tupaki Desk | 20 Feb 2018 11:30 PM GMTప్రమోషన్స్ చేయడంలో రాజమౌళి తరువాతే ఇంకెవరైనా అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనుకున్నది చేయడానికి ఎలాంటి ప్రయత్నం అయినా చేస్తారు. అయితే ఆయన కష్టం వల్ల ఏమో గాని ఇతరులు కూడా ఆయన చెప్పింది చేయడానికి చాల కష్టపడుతుంటారు. ఈగ సినిమా జక్కన్న కెరీర్ లో ఒక బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. అయితే ఆ సినిమా ద్వారానే రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో కొత్త పాఠాలు నేర్చుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈగ ఆడియో వేడుకలో అందరిని ఎక్కువగా ఆకట్టుకున్న విషయం ఏదైనా ఉందా అంటే.. తాగుబోతు రమేష్ కమెడియన్ వేణు ఒగ్గు కథను బేస్ చేసుకొని చేసిన పెర్ఫామెన్స్ అందరికి మంచి కిక్ ఇచ్చింది. ఒగ్గు కథ అంటే ఆంద్రా స్లాంగులో బుర్ర కథ అనుకోండి. ఆ స్కిట్ లో వారు సినిమా చిత్ర యూనిట్ పై పంచ్ లు హైలెట్ గా నిలిచాయి. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా వేణు అండ్ రమేష్ స్టేజ్ పై చేసిన విధానం తారలను కూడా ఆకట్టుకుంది. అయితే మొదట ఆ ఒగ్గు కథ చేయడానికి వేణు ఇష్టపడలేదట.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు. వేణు మాట్లాడుతూ.. మొదట నేను స్టేజ్ షోలను చేయొద్దు అనుకున్నా. కానీ రాజమౌళి గారు పిలిచి అడగడంతో ఒప్పుకోక తప్పలేదు. మొదట ఒగ్గు కథ అనుకోలేదు. ఎదో రెండు లైన్ల వల్ల రాజమౌళి గారికి బాగా నచ్చడంతో అదే చేయాలనీ ఆయన పట్టుబట్టారు. కానీ మేము నాలుగు రోజుల తరువాత చేయలేము అని చెప్పాము. రాజమౌళికి గారికి విసుగొచ్చి మీకు చేయాలనీ ఇంట్రెస్ట్ లేదు కదా? అని మీకు ఏది వచ్చో అది చేయండి అని చెప్పేశారు. ఆ తరువాత స్పెషల్క్ గా మా ఉరికి వెళ్లి ప్రాక్టీస్ చేసి స్కిట్ చేశామని వేణు వివరించాడు.