Begin typing your search above and press return to search.
హీరోగా మాత్రమే నటిస్తానంటున్న కమెడియన్..?
By: Tupaki Desk | 16 July 2022 11:30 PM GMTటాలీవుడ్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది నటులు హీరో అవతారమెత్తిన సంగతి తెలిసిందే. అలాంటి వారిలో సుహాస్ ఒకరు. 'మజిలీ' 'డియర్ కామ్రేడ్' 'ప్రతిరోజూ పండగే' 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి చిత్రాల్లో తనదైన మార్క్ కామెడీతో హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్.
అయితే 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారిన సుహాస్.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటుగా పలువురు సినీ ప్రముఖుల మన్ననలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం సుహాస్ నటనను మెచ్చుకున్నారు.
ఇదే క్రమంలో 'ఫ్యామిలీ డ్రామా' చిత్రంలో విలక్షణమైన సైకో పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' 'రైటర్ పద్మభూషణ్' వంటి మరో రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అయితే సుహాస్ ఇకపై హీరోగా మాత్రమే సినిమా చేయాలనుకుంటున్నాడని.. అందుకే తన వద్దకు వచ్చిన హాస్యనటుల పాత్రలను రిజెక్ట్ చేస్తున్నాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హీరోగా మారిన ఎందరో కమెడియన్స్ ఓ వైపు తమ కామెడీతో నవ్విస్తూనే.. అవకాశం వచ్చినప్పుడు కథానాయకుడిగా నటిస్తున్నారు. అలా కాదు హీరోగా మాత్రమే చేస్తానని మడి కట్టుకొని కూర్చున్న చాలా మంది నటులు.. తర్వాత రోజుల్లో అవకాశాలు సన్నగిళ్లడంతో చివరకు తిరిగి కామెడీ వేషాలు వేస్తున్న విషయం తెలిసిందే.
కానీ సుహాస్ మాత్రం ఇలాంటి ఏమీ ఆలోచించకుండా హీరోగా మాత్రమే సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. కాకపోతే థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకోకుండా.. తక్కువ బడ్జెట్ లో ఓటీటీలే లక్ష్యంగా చేసుకుని హీరో పాత్రలు చేయాలని అనుకుంటున్నాడట. తన వద్దకు వచ్చిన నిర్మాతలకు ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడని టాక్ వినిపిస్తోంది.
సుహాస్ హీరోగా చేసిన 'కలర్ ఫోటో' 'ఫ్యామిలీ డ్రామా' సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నటిస్తున్న 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' 'రైటర్ పద్మభూషణ్' వంటి సినిమాల విడుదల లపై క్లారిటీ రావాల్సి ఉంది.
'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ సహకారంతో స్వేచ్ఛ క్రియేషన్స్ - మహా క్రియేషన్స్ బ్యానర్స్ మీద రూపొందిస్తున్నారు. 'C/o కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా సమర్పణలో ధీరజ్ మోగిలినేని నిర్మిస్తున్నారు. దుశ్యంత్ కటికనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇక 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో షణ్ముఖ ప్రశాంత్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాల నుంచి విడుదలైన ససుహాస్ ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ కమెడియన్ టర్న్ హీరోకి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.