Begin typing your search above and press return to search.

త‌రుణ్ భాస్క‌ర్ మూవీలో కామెడీ కింగ్!

By:  Tupaki Desk   |   1 Feb 2023 12:04 PM GMT
త‌రుణ్ భాస్క‌ర్ మూవీలో కామెడీ కింగ్!
X
'పెళ్లి చూపులు' మూవీతో జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న త‌రుణ్ భాస్క‌ర్ ఆ త‌రువాత 'ఈ న‌గ‌రానికి ఏమైంది' అంటూ మ‌రో విభిన్న‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. కొంత విరామం త‌రువాత త‌రుణ్ భాస్క‌ర్ ఓ విభిన్న‌మైన క‌థ‌తో తెర‌కెక్కిస్తున్న లేటెస్ట్ ఎంట‌ర్ టైన‌ర్ 'కీడాకోలా'. రాజ‌మౌళి ఈగ‌తో సినిమా చేసి సంచ‌ల‌నం సృష్టిస్తే త‌రుణ్ భాస్క‌ర్ కీడా.. అదే బొద్దింక‌తో సినిమా చేస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.

కొన్ని రోజుల క్రితం లాంఛ‌నంగా మొద‌లైన ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. అంతా యంగ్ టీమ్ తో నూత‌న న‌టీన‌టుల‌తో ఈ మూవీని త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు.

రాకెట్ స్పీడ్ తో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతోంది. విజీ సైన్మా, క్విక్ ఫాక్స్ బ్యాన‌ర్ ల‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ మూవీ నుంచి కీల‌క అప్ డేట్‌ని ఇస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ప్ర‌క‌టించాడు. ఇదే సంద‌ర్భంగా ఆన్ లోకేష‌న్ కు సంబంధించిన ఓ వీడియోని విడుద‌ల చేశాడు.

అన్న‌ట్టుగానే ఫిబ్ర‌వ‌రి 1న ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ని ఇచ్చేశారు. ఇందులో మొత్తం 8 ప్ర‌ధాన పాత్ర‌లు వున్నాయి. అయితే ఇందులో హీరోలు, హీరోయిన్ లు అంటూ ఎవ్వ‌రూ లేరు. అయితే ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ చిత్ర బృందం ఫిబ్ర‌వరి 1న బ్ర‌హ్మానందం పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. 'మీ ప్ర‌పంచం వింత‌గా మారబోతోంది' అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇందులో బ్ర‌హ్మానందంని నెవ‌ర్ బిఫోర్ క్యారెక్ట‌ర్ లో చూపించ‌బోతున్నార‌ట‌.

ఇదే విష‌యాన్ని త‌రుణ్ భాస్క‌ర్ వెల్ల‌డించాడు. స్టార్ తో క‌లిసి సినిమా చేయ‌డం టెన్ష‌న్ తో కూడుకున్న ప‌ని అందుకే స్టార్స్ తో కాకుండా సినిమా చేయాల‌ని క్రైమ్‌ కామెడీ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాన‌ని, ఇందులో బ్రహ్మానందంని నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్ లో చూపించ‌బోతున్నాన‌ని తెలిపారు. ప్ర‌తీ ఇంట్లో వుండే తాత పాత్ర‌లో ఆయ‌న క‌నిపిస్తారు. పేరు వ‌ర‌ద‌రాజు. వీల్ చైర్ లో బందీ అయిన వ్య‌క్తి. దానికి యూరిన్ బ్యాగ్‌.

గ‌మ్మ‌త్తైన క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఎలా వుండ‌బోతోందో.. ఎలాంటి సంచ‌ల‌నాల‌ని సృష్టించ‌బోతోందో తెలియాలంటే రిలీజ్‌ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఈ ఏడాదే ఈ ఊవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్ర‌ఫీ ఏజే అరూన్‌, ఎడిటింగ్ ఉపేంద్ర వ‌ర్మ‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.