Begin typing your search above and press return to search.
ఏమి సేతుర లింగా: ఇంక్ ఎండిపోయింది
By: Tupaki Desk | 7 April 2015 11:54 AM GMTమాటలతో సెటైర్లు పేల్చి కామెడీ చేయడం ఓ రకం. లేదంటే ఎవరన్నా ఓ హీరో చేతిలో తన్నులు తిని కామెడీ చేయడం ఇంకో రకం. మాటలతో కామెడీ అనేది సినిమాలకు సౌండ్ వచ్చాక కనిపెడితే, ఇక చేతలతో కామెడీ అనేది ఎప్పుడో చార్లీ చాప్లిన్ వంటి దిగ్గజాలు చేసిపాడేశారు..
కాని మన కొత్త కొత్త తెలుగు సినిమాల విషయానికొస్తే... అసలు ఎందులోనూ ఎటువంటి కామెడీ ఉండట్లేదు. సిట్యుయేషన్ కామెడీ కంటే కూడా సెటైర్లు, డబుల్ మీనింగ్‌లతో కూడిన కామెడీయే అధికంగా. ఇక ఈ ఏడాది వచ్చిన కొత్త సినిమాల్లో చూసుకుంటే.. అందరూ కాస్త కష్టంగానే నవ్విస్తున్నారు. పటాస్‌లో మాత్రం కాస్త జనాలను పిచ్చికొట్టుడు కొట్టో, లేకపోతే డబుల్ మీనింగ్ సెటైర్లు వేసో నవ్విస్తే, గెడ్డం గ్యాంగ్ వంటి కామెడీ సినిమాల్లో కామెడీయే లేదు. టెంపర్‌లో అన్నీ ఎన్టీఆర్ అరుపులే, ఇక బందిపోటులో అల్లరి నరేష్ రిపిటీషన్లే. రేయ్ దెబ్బకి చెవ్వుల్లో తుప్పు వదిలపోతే, జిల్‌లో మరీ చప్పని కూరలు వడ్డించారు. ఇక నాని బాబు అంటారా.. చేసినదే చేస్తున్నాడు. కొత్తగా ఏం లేదు అక్కడ కామెడీ పరంగా..
ఇప్పుడు కామెడీలో కొత్త రకం ఏంటంటే.. బ్రహ్మానందాన్ని పవన్ కళ్యాణ్‌లా చూపించడం, ఎమ్మెస్‌తో మహేష్‌బాబు డైలాగులు చెప్పించడం, లేదంటే ఓ సినిమా హీరో క్యారెక్టర్ క్రియేట్ చేసి ఇతర హీరోలపై పంచ్‌లు వేయడం. అంతేకాని జంధ్యాల టైపులో ఒరిజినల్ కామెడీ రాయలేకపోతున్నాం. ఎందుకో? మన రైటర్స్ పెన్‌లో ఇంక్ అయిపోయినందుకా? లేక మైండ్ సెట్ కాపీ కొట్టడానికే అలవాటుపడినందుకా?