Begin typing your search above and press return to search.
నాగబాబు కామెంట్ నెం.5 : సంకర జాతి పార్టీనా?
By: Tupaki Desk | 8 Jan 2019 6:20 AM GMTమెగా బ్రదర్ నాగబాబు వరుసగా బాలకృష్ణ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తూ వీడియోలను వదులుతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ చేసిన నాలుగు వివాదాస్పద కామెంట్స్ పై తన నాలుగు కామెంట్లను విడుదల చేసిన నాగబాబు తాజాగా బాలకృష్ణ చేసిన అయిదవ వివాదాస్పద కామెంట్ పై నాగబాబు స్పందించాడు. బాలకృష్ణ గతంలో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సమయం కావడంతో తలా తోక లేని పార్టీలు పుట్టుకు వచ్చాయి. సంకర జాతి పార్టీ ఒక తోక లేదు - ఒక తొండం లేదు - అలాగా బలగా జనాన్ని వేసుకుని తిరుగుతున్న పార్టీలను మనం ఇప్పుడు చూస్తున్నాం అంటూ బాలకృష్ణ గతంలో జనసేన గురించి కామెంట్ చేశాడంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తన కామెంట్ నెం.5 వీడియోలో బాలకృష్ణ చేసిన పై వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ... మీరు ఆల్ రెడీ జగన్ పార్టీని డైరెక్ట్ గా వైకాపా అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు పేరు చెప్పకుండా, ఇండైరెక్ట్ గా అలగా పార్టీ - సంకరజాతి పార్టీ అంటూ విమర్శలు చేయడం అది జనసేన గురించే అని మేము అనుకుంటున్నాం. తెలుగు దేశంను పవన్ విమర్శించాడు కనుక మీరు కూడా పవన్ ను, జనసేనను విమర్శించండి - అందులో తప్పు లేదు - నేను ఏమి అనను. కాని మీరు పార్టీలో ఉన్న వారిని అలగా జనం అంటూ విమర్శలు చేశారు. జనసేన పార్టీలో అన్ని కమ్యూనిటీలకు చెందిన వారు ఉన్నారు. అన్ని కమ్యూనిటీలకు చెందిన వారు మీ తెలుగు దేశంతో పాటు అన్ని పార్టీల్లో ఉంటారు. అలాంటప్పుడు అలగా జనం అంటూ ఎలా కామెంట్ చేస్తారంటూ నాగబాబు ప్రశ్నించారు.
అలగా బలగా జనం - సంకర జాతి పార్టీ అన్నారు. వీళ్లంతా కూడా అలగా బలగా జనం అని మీ ఉద్దేశ్యమా, సంకర జాతి వారని మీరు అనుకుంటున్నారా - మీరు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకు ఎవరు చెప్పలేదా అంటూ నాగబాబు అన్నాడు. ఇక చివరిదైన ఆరవ వివాదాస్పద వ్యాఖ్యలకు నేను ఏం సమాధానం చెప్పబోతున్నానో చెప్పి, ఆ తర్వాత ఇలాంటి వివాదానికి ముగింపు ఇవ్వబోతున్నట్లుగా నాగబాబు తన కామెంట్ నెం.5 వీడియోను ముగించాడు. ఈ నేపథ్యంలో ఆరవ వీడియో కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.